Civil Services Free Coaching: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు రేపటితో ముగియనున్నట్లు స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీధర్ సెప్టెంబర్ 5న ఓ ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించిన సీశాట్- 2023 (ప్రవేశ పరీక్ష ) ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌తోసహా వరంగల్, నిజామాబాద్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సెస్టెంబర్ 7వ తేదీ ముగింపు సమయంలోపు తెలంగాణ స్టడీ సర్కిల్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు ఎనిమిది నెలల పాటు ఉచిత శిక్షణ కల్పిస్తామని, ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్ల కేటాయింపు ఉంటుందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.