TS RTC: తెలంగాణ మహిళలకు సజ్జనర్‌ విజ్ఞప్తి.. ఫ్రీ బస్సుల్లో ఆలా చేయొద్దంటూ సూచన..

ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత బస్సుల ప్రయాణం విషయంలో కొన్ని సమస్యలు ఎదురువుతున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ...

TS RTC: తెలంగాణ మహిళలకు సజ్జనర్‌ విజ్ఞప్తి.. ఫ్రీ బస్సుల్లో ఆలా చేయొద్దంటూ సూచన..
Sajjanar

Updated on: Dec 23, 2023 | 9:48 AM

తెలంగాణ కొత్త ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మహా లక్ష్మి’ పథకానికి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణ ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయాన్ని అందిస్తోంది. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా మహిళలు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ఉచిత బస్సుల ప్రయాణం విషయంలో కొన్ని సమస్యలు ఎదురువుతున్నట్లు ఆర్టీసీ దృష్టికి వచ్చింది. ఈ విషయమై తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కీలక ప్రకటన చేశారు. మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

తక్కువ దూరం ప్రయాణించే మహిళలు సైతం ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఎక్కువగా వెళ్తున్నట్లు యాజమాన్యం దృష్టికి వచ్చిందని సజ్జనార్‌ తెలిపారు. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ కోరారు. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారన్న సజ్జనార్.. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని చెప్పుకొచ్చారు.

 

ఇకపై ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కేవలం అనుమతించిన స్టేజీల్లోనే ఆపుతామని ఆయన తేల్చి చెప్పారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్‌ కోరారు. మహా లక్ష్మీ పథకం సక్రమంగా అమలు చేయడానికి మహిళలు, చిన్నారులు, ట్రాన్స్‌జెండర్స్‌ మరింత సహకరించాలని సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..