Telangana: రాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. దాదాపు 44 గంటల తర్వాత..

|

Dec 15, 2022 | 2:17 PM

పోలీసుల ఆపరేషన్‌ ఫలించింది. కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ అయ్యింది..అతని ఫోన్‌ కింద పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించి గుహలో చిక్కుకున్న రాజును రెస్క్యూ టీమ్ కాపాడింది.

Telangana: రాజు సేఫ్.. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్.. దాదాపు 44 గంటల తర్వాత..
Kamareddy Raju
Follow us on

ఆపరేషన్ సక్సెస్ అయ్యింది..రెండ్రోజులు గుహలో బండరాళ్ల మధ్య ఉక్కిరిబిక్కిరైన రాజు.. ఎట్టకేలకు మృత్యుంజయుడిగా బయటికొచ్చాడు. దాదాపు 20గంటల పాటు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీమ్‌..రాజును సేఫ్‌గా బయటకు తీసుకొచ్చారు.

పోలీసుల ఆపరేషన్‌ ఫలించింది. కామారెడ్డిలో రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్ అయ్యింది..అతని ఫోన్‌ కింద పడిపోవడంతో తీసేందుకు ప్రయత్నించి గుహలో చిక్కుకున్న రాజును రెస్క్యూ టీమ్ కాపాడింది..ఎట్టకేలకు రాజు బతుకు జీవుడా అంటూ క్షేమంగా భూమిపైకి చేరుకున్నాడు. రెండు రోజులుగా బండరాళ్ల మధ్య గుహలో చిక్కుకున్న రాజు..రెండ్రోజుల నరకయాతన తర్వాత సేఫ్‌గా బయటపడ్డాడు.

కామారెడ్డి జిల్లా సింగరాయపల్లి గుహల్లో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగించారు. రెండ్రోజులుగా బండరాళ్ల మధ్య చిక్కుకున్న రాజును క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు 80 మంది అధికారులతో జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రెండ్రోజులుగా మంచినీరు, ఆహారం లేక నీరసించిపోయిన రాజుకు..ఫ్లూయిడ్స్‌ను అందించారు. జిలెటిన్‌ స్టిక్స్‌తో వరుసగా బ్లాస్టింగ్స్‌ చేశారు. ఆ తర్వాత రాజుకు అడ్డుగా ఉన్న బండరాళ్లను తొలగించడంతో రాజు కాళ్లు బయటకు కనిపించాయి. దీంతో రాజును జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు రెస్క్యూ టీమ్..