Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. బీజేపీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..!

|

Jan 09, 2023 | 11:32 AM

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు...

Telangana: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. బీజేపీలోకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..!
Ponguleti Srinivas Reddy
Follow us on

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చిన సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయనున్నారు. ఇక ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు టీఆర్‌ఎస్‌ నుంచి ఇతర పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. ఈ జాబితాలో ఖమ్మం జిల్లా నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల నియోజకవర్గ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ బీజేపీలో చేరిక దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది.

అయితే బీజేపీలో చేరిక గురించి శ్రీనివాస్‌రెడ్డితో అధిష్టానం నేరుగా మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 18వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. అమిత్‌ షా భేటీ తర్వాతే పొంగులేటి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సహచరులను సైతం పొంగులేటి సిద్ధం చేస్తున్నారు. 10వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో అనుచరులతో భేటీ కానున్నారు.

నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కినట్లు కనిపించింది. రాబోయే ఎన్నికల్లో కురుక్షేత్రానికి శ్రీనన్న సిద్ధంగా ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల అభిమానాన్ని, దీవెనలు అందుకున్నవాడే నాయకుడంటూ వ్యాఖ్యలు చేశారు. తనకు ఏ పదవీ లేకపోయినా ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నానని అన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో పొలిటికల్‌ హీట్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి