Telangana Police : తెలంగాణలో పోలీసుల స్టైల్ మార్చనున్నారు. ఇకపై శృతి మించితే లాఠీలకు పనిచేపనున్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడుల నేపధ్యంలో పొలిసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి బ్రేక్ ఇవ్వనున్నారు తెలంగాణ కాప్స్. ఆందోళనలు శ్రుతి మించితే లాఠీలకు పని చెప్పాలని నిర్ణయించారు.
ఇటీవల పరకాల ఎమ్మెల్యే ధర్మ రెడ్డి ఇంటిపై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తేడా వస్తే ఉపేక్షించేది లేదంటున్నారు. ప్రజాప్రతినిధులకు రక్షణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. అందుకే తెలంగాణలో ఆరేళ్లుగా కొనసాగుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి బ్రేక్ ఇవ్వనున్నారు. ఇక మీదట ఆందోళనలు తీవ్ర రూపం దాల్చితే కఠినంగా వ్యవహరించేందుకు సిద్దం అయ్యారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లా కమిషనర్లకు, ఎస్పీలకు డీజీపీ నుంచి ఆదేశాలు అందాయి. అయితే మహిళలు , రైతుల విషయంలో సంయమనం పాటించాలని స్టేట్ పోలీస్ బాస్ సూచించారు.
Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?
Kurnool milk in kgs: కర్నూలు జిల్లాలో లీటర్లలో పాలు అమ్ముతున్న పాడి రైతులు.. ధర రూ.33 మాత్రమే.. !