Telangana: చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది

పేరెంట్ యాక్ట్.. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొంది, దేశవ్యాప్తంగా బిగ్‌డిబేట్‌ టాపిక్‌గా మారింది. సామాజికంగా, రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆధునిక జీవితంలో బిజీ అయిన బిడ్డలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం లేదన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం పేరెంట్ యాక్ట్‌ బిల్లును తీసుకొచ్చింది. మరి ఈచట్టంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి.

Telangana: చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది
Telangana Parent Act

Updated on: Mar 30, 2026 | 7:17 AM

ఇప్పటి వరకు కుటుంబ బాధ్యత అనేది నైతికంగా మాత్రమే ఉండేది. పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవాలి అనేది వాళ్ల అది బాధ్యత. కానీ ఇప్పుడా బాధ్యత చట్టంగా మారింది. అంటే ఇక నుంచి తల్లిదండ్రులను చూసుకోవడం చాయిస్ కాదు. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ యాక్ట్ ప్రకారం ఉద్యోగి తన తల్లిదండ్రులను పట్టించుకోకపోతే అతని జీతంలో 15శాతం కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే విధానం తీసుకొచ్చారు.

ప్రస్తుతం సమాజంలో జాయింట్ ఫ్యామిలీస్ తగ్గిపోయాయి. కారణం ఉద్యోగాల కోసం వేరే నగరాలు, దేశాలకు పిల్లలు వెళ్లిపోవడం, ఈ ప్రాసెస్‌లో తల్లిదండ్రులు ఒంటరిగా మిగిలిపోవడం కామనైపోయింది. కొంతమంది డబ్బు సంపాదిస్తున్నా.. తల్లిదండ్రుల మీద ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దలు ఎమోషనల్‌గా మాత్రమే కాదు ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రబుత్వం ఈ సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.

పేరెంట్స్ యాక్ట్ ప్రయోజనాలు ఏమిటి

వృద్ధుల ఆర్థిక భద్రత

ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఉద్యోగి, తమ తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే, జీతంలో కోతపడుతుంది. ఆకోతపడ్డ జీతం తల్లిదండ్రుల ఖాతాల్లోకి వెళ్తుంది. అంటే ఇది వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు ఆర్ధిక భరోసాగా ఉంటుంది.

కుటుంబ విలువలకు రక్షణ

మన సంస్కృతిలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవడం గొబ్బ బాధ్యత. కానీ అది క్రమంగా తగ్గిపోయింది. ఈ చట్టం ఆ విలువను మళ్లీ గుర్తు చేస్తోంది. చూసుకోకుంటే శిక్ష తప్పదు అన్న భయంతోనైనా పెద్దలను బాధ్యతగా చూసుకుంటారన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం

వృద్ధులపై జరుగుతున్న నిర్లక్ష్యం, హింస తగ్గే అవకాశం

చాలా కేసుల్లో పెద్దలను నిర్లక్ష్యం చేయడం, ఒంటరిగా వదిలేయడం, కొన్ని చోట్ల మానసికంగా ఇబ్బంది పెట్టడం జరుగుతోంది. ఈ చట్టం వల్ల అలాంటి సంఘటనలు తగ్గే అవకాశం ఉంది.

ప్రభుత్వంపై భారం తగ్గుతుంది.

వృద్ధుల కోసం ప్రభుత్వానికి చాలా స్కీమ్స్, పెన్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ పిల్లలు చూసుకుంటే ఆ భారం కొంతవరకు తగ్గుతుంది.

ఈచట్టం తీసుకొచ్చింది ఓటు బ్యాంక్ కోసం కాదన్నది కాంగ్రెస్ సర్కార్ చెబతున్న మాట. దీని వెనుక ఒక సామాజిక ఆందోళన ఉందని ప్రభుత్వం గ్రహించింది. వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్‌లో వృద్ధులు వెనుకబడిపోతున్నారు. టెక్నాలజీ, అర్బనైజేషన్, మైగ్రేషన్.. ఇవన్నీ కలిసి కుటుంబ వ్యవస్థను మార్చేశాయి. అందుకే ఈయాక్ట్ అవసరం వచ్చిందంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం.ఈ చట్టంవల్ల కుటుంబ వ్యవస్థను కాపాడటమే కాదు, వృద్ధుల హక్కులను రక్షించవచ్చంటోంది ప్రభుత్వం

మరోవైపు యాక్ట్‌పై పలు ప్రశ్నలు, సందేహాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం యాక్ట్‌లోకి ఉద్యోగులు, నేతలను తీసుకొచ్చారు. అయితే తమ పిల్లలు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తేనే యాక్ట్‌ అమలయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య వ్యక్తిగత వివాదాలు కూడా ఉండొచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ చట్టం మిస్యూస్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. మరి చూడాలి, పేరెంట్ యాక్ట్ తోనైనా పిల్లల్లో మార్పు వస్తుందా.. పెద్దలు కష్టాలు తీరిపోతాయా అన్నది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us