Nagarjuna Sagar: తెగిన నాగార్జున సాగర్‌ కాలువ! హుటాహుటిన మరమ్మత్తులకు చర్యలు

|

Sep 09, 2022 | 10:12 AM

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నిడమనూరు మండలం ముప్పారం వద్ద భారీ గండి పడింది. దీంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నిడమనూరు నరసింహుల గూడెంలోకి నీటి ప్రవాహం..

Nagarjuna Sagar: తెగిన నాగార్జున సాగర్‌ కాలువ! హుటాహుటిన మరమ్మత్తులకు చర్యలు
Nagarjuna Sagar
Follow us on

Nagarjuna sagar left canal breaches: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నిడమనూరు మండలం ముప్పారం వద్ద భారీ గండి పడింది. దీంతో వందలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. నిడమనూరు నరసింహుల గూడెంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరడంతో నిడమనూరులో రోడ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. డ్రైనేజీ దెబ్బతినింది. గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులను, ఆయా గ్రామాల ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. కాలువలో నీటిప్రవాహం తగ్గిన వెంటనే ఎన్ఎస్పి సిబ్బంది మరమ్మత్తు పనులు స్టార్ట్ చేశారు. గండికి ప్రధాన కారణం యూటీ వద్ద లీకేజే కారణమని అధికారులు చెప్పారు. గండి పడిన వెంటనే యంత్రాంగం అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. గండి మరమ్మత్తు పనులు నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామని ఎన్‌ఎస్‌పి అధికారులు స్పష్టం చేశారు .