
Telangana Municipal Poll Results 2026 LIVE: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్‌ల బయట వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ పైకి తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడుతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్లను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్‌లో వెయ్యి బ్యాలెట్ల 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్‌కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్‌ను అనుమతిస్తారు.
కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1,000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనుండగా, అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కొత్తగూడెం కార్పొరేషన్‌లో గంటగంటకు సమీకరణాలు మారిపోతున్నాయి. 32వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ రాంబాబును.. కాంగ్రెస్ పార్టీ నేతలు కిడ్నాప్ చేశారని ఆయన భార్య నాగమణి ఆరోపిస్తున్నారు. తన భర్తను వెంటనే విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు.
1. జహీరాబాద్
2. కేసముద్రం
3. కోహిర్
4. దేవరకద్ర
5. అలంపూర్
6. ఇస్నాపూర్
7. అమరచింత
8. జనగాం
9. ఆసిఫాబాద్
10. జిన్నారం
11. జమ్మికుంట
12. ఆలియాబాద్
13. బోధన్
14. వేములవాడ
15. గద్వాల
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో సత్తా చాటిన కాంగ్రెస్.
మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకున్న హస్తం పార్టీ.
కాంగ్రెస్…31
బీఆర్ఎస్… 14
బీజేపీ…1
ఇతరులు..2 వార్డుల్లో గెలుపు.
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో తల్లి కొడుకులు విజయం…
వేర్వేరు పార్టీల నుంచి పోటీచేసిన తల్లి కొడుకులు..
నాలుగో వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్ధి గా తల్లి బత్తుల శకుంతల విజయం..
ఏడో వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా కొడుకు బత్తుల శ్రీనివాస్ విజయం.
జనగామ మున్సిపల్ చైర్మన్ పీఠం పై ఉత్కంఠ
కీలకంగా మారిన స్వతంత్ర అభ్యర్థులు
చైర్మన్ పీఠం డిమాండ్ చేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు
గెలిచిన స్వతంత్ర అభ్యర్థులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ – BRS పోటా పోటీ ప్రయత్నాలు
పాండు అనే 15వ వార్డు స్వతంత్ర అభ్యర్థిని చుట్టుముట్టిన కాంగ్రెస్ , BRS నేతలు
కౌంటింగ్ కేంద్రం నుండి కారులో తీసుకెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
జనగామ మున్సిపాలిటీ మొత్తం వార్డులు: 30
కాంగ్రెస్ – 12
BRS – 13
CPM – 01
స్వతంత్రులు – 04
— AIFB నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు
— 40 మున్సిపాలిటీల్లోని 212 వార్డుల్లో పోటీ
— వడ్డేపల్లి మున్సిపాలిటీలో AIFB విజయం
— వడ్డేపల్లిలోని 10లో 8 వార్డులు విజయం
— సుల్తానా బాద్‌లో ఒక వార్డులో విజయం
— పెద్దపల్లి 1 వార్డు, మంథని 1 వార్డు
— రామగుండంలో 10 నుంచి 12 లీడ్
— ఆదిలాబాద్ లో 8 లీడ్, మంచిర్యాలలో 4 లీడ్
— ఒవరాల్‌గా 40 వరకూ గెలుస్తామన్న ధీమా
కొనసాగుతున్న కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్ కౌంటింగ్
66 వార్డులున్న కరీంనగర్ లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల వివరాలు..
— బీజెపీ : 28
— బీఆర్ఎస్ : 13
— కాంగ్రెస్ : 19
— ఇతరులు: 02
కారు పార్టీకే జై కొట్టిన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ప్రజలు
మొత్తం 24 వార్డులకు బీఆర్ఎస్ – 13 వార్డులు
కాంగ్రెస్ – 08 వార్డులు
బీజేపీ – 02 వార్డులు
స్వతంత్ర – 01 వార్డులో విజయం
వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు -12
కాంగ్రెస్ – 06
బీఆర్ఎస్ – 01
MIM -01
సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కంజర్ల శ్రీవాణి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు.
మెదక్ మునిసిపాలిటిలో బీఆర్ఎస్ తరపున పోటీచేసిన తల్లి, కొడుకు విజయం
29వ వార్డు నుంచి కొడుకు భట్టి ఉదయ్ విజయం
17 వ వార్డు నుంచి తల్లి భట్టి లలిత గెలుపు
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో భార్యాభర్తలు ఘనవిజయం..
కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గజవాడ లావణ్య 281 వోట్ల మెజార్టీ
భర్త బెజవాడ నాగరాజు 126 ఓట్ల మెజార్టీతో గెలుపు
వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాలిటీలో హంగ్.
మెజారిటీ సంఖ్య 6 ను చేరుకోలేకపోయినా పార్టీలు
మొత్తం వార్డులు : 10
కాంగ్రెస్: 03
BRS: 03
BJP:03
ఇతరులు: 01
— ఆదిలాబాద్ లో తొలి ఫలితం విడుదల
— ఖాతా తెరిచిన బీజేపీ
— ఆదిలాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 48 వార్డు స్వతంత్ర అభ్యర్థి రంగినేని మనీషాపై బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక 34 ఓట్లతో విజయం.
— సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మునిసిపాలిటీలోనూ హంగ్
— మొత్తం 26వార్డుల్లో అత్యధికంగా BRS విజయం
— BRS – 12, కాంగ్రెస్ – 10, స్వతంత్రులు- 4
— ఉమ్మడి మహబూబ్‌నగర్ ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి
— 18 మున్సిపాలిటీలో ఒకటి కాంగ్రెస్ వశం కాగా.. మరొకటి BRS ఖాతాలో చేరింది
— భూత్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— 12 స్థానాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం
— ఐజా మున్సిపాలిటీ BRS కైవసం
— మరో మున్సిపాలిటీ అమరచింతలో బీఆర్ఎస్ ఆధిక్యం
— అలంపూర్‌లో కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ
— హంగ్ దిశగా దేవరకద్ర మున్సిపాలిటీ
— వడ్డేపల్లి కవిత మద్దతుదారులు AIFB వశం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోనూ ఆసక్తికర ఫలితాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
బెల్లంపల్లిలోని మొదటి రౌండులోని 17 వార్డుల ఫలితాలు వెల్లడి
బీఆర్ఎస్ – 08
కాంగ్రెస్ – 08
స్వతంత్ర – 01
— హుజురాబాద్ మున్సిపాలిటి కాంగ్రెస్ కైవసం
— మొత్తం స్థానాలు 30, కాంగ్రెస్ 16, బిఅర్ఎస్ 08, బిజేపి – 05, ఇండిపెండెంట్ – 01
వరంగల్ జిల్లాలోని కేసముద్రం మున్సిపల్ ఎన్నికల్లో హాంగ్..
8 వార్డులు కాంగ్రెస్ ,8 వార్డులు బి ఆర్ ఎస్ గెలుపు..
ఎక్స్ అఫిషియో ఓట్లతో మున్సిపాలిటీ కైవసం చేసుకోనున్న కాంగ్రెస్..!
— నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్‌లలో అధికార పార్టీ ముందంజ
— నల్గొండలో 48 స్థానాల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ముందంజ
— రెండు స్థానాల్లో ముందంజలో ఉన్న BRS
— కొత్తగూడెంలో ఎక్కువ స్థానాల్లో ఆధిక్యంలో కాంగ్రెస్
— ఆలస్యంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌంటింగ్
— 60 డివిజన్‌లకు ఒకేసారి కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సంచలన నమోదైంది. చిట్యాల 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రాన్స్‌జెండర్ నాగిళ్ల సుధాకర్ ఘన విజయం సాధించారు. తాజా ఫలితాల్లో 102 ఓట్ల మెజారిటీతో జయకేతనం ఎగురవేశారు.
— సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— మొత్తం 26 వార్డుల్లో ఇప్పటికే 14 స్థానాలు గెలిచిన కాంగ్రెస్
— బీఆర్ఎస్-6, బీజేపీ -1, ఇండిపెండెంట్స్-1
— జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో షాకింగ్ రిజల్ట్
–వడ్డేపల్లి మున్సిపాలిటీ AIFB కైవసం
–వడ్డేపల్లిలో AIFB 8, కాంగ్రెస్ 1, బీఆర్‌ఎస్ 1
–AIFB గుర్తుపై పోటీ చేసిన కవిత మద్దతుదారులు
— ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై జాగృతి నేతలు పోటీ
— అలంపూర్ మున్సిపాలిటీలో హంగ్
— అలంపూర్‌లో మొత్తం 10 వార్డులు
— చెరో ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ గెలుపు
— దేవరకద్ర మున్సిపాలిటీలో హంగ్
— దేవరకద్రలో మొత్తం 12 వార్డులు
— కాంగ్రెస్-6, బీఆర్ఎస్-4, బీజేపీ-1, ఇతరులు-1
— కోహిర్ మున్సిపాలిటీలో ఆసక్తికరంగా ఫలితం
— మొత్తం 16 వార్డుల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం
— ఐదు స్థానాల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్
— ఒక్కో వార్డులో MIM, బీజేపీ, ఇండిపెండెంట్ విజయం
— మ్యాజిక్ ఫిగర్‌కు ఒక స్థానం దూరంలో కాంగ్రెస్
— కీలకంగా మారిన ఇండిపెండెంట్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా
పెద్దపల్లి: సుల్తానాబాద్ కాంగ్రెస్ కైవసం
సుల్తానాబాద్(15): కాంగ్రెస్-12, బీఆర్ఎస్-1
బీజేపీ-1, ఇతరులు-1 వార్డులో విజయం
మంథని మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మంథని(13): కాంగ్రెస్-11, BRS-1, ఇతరులు-1
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణీ కొట్టింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
— బాన్సువాడ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— మొత్తం 19 వార్డుల్లో కాంగ్రెస్ 10చోట్ల విజయం
— బీజేపీ-3, బీఆర్‌ఎస్-3, ఎంఐఎం-1
— ఒకచోట ఇండిపెండెంట్ విజయం
— ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీల ఫలితాలు
— నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— నారాయణఖేడ్(15): కాంగ్రెస్-10, BRS-2, BJP-1
— గడ్డపోతారం మున్సిపాలిటీ BRS కైవసం
— 14 వార్డుల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయం
— మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు
— ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం
— గుమ్మడిదల మున్సిపాలిటీ BRS కైవసం
— గుమ్మడిదల (22): BRS 14, కాంగ్రెస్ 4
— గుమ్మడిదల (22): BJP 2, ఇండిపెండెంట్ 1
— ఇంద్రేశం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం
— ఇంద్రేశం(18): బీఆర్‌ఎస్-9, కాంగ్రెస్-6
— బీజేపీ-2, ఇండిపెండెంట్-1 వార్డుల్లో విజయం
— నారాయణఖేడ్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— మొత్తం 15 వార్డుల్లో 10 చోట్ల కాంగ్రెస్ విజయం
— రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్.. ఒకచోట బీజేపీ గెలుపు
తొర్రూరు మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం
మొత్తం 16 వార్డులకు గాను
10 వార్డుల్లో బీఆర్ఎస్, 6 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం
— హుజూర్‌నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— మొత్తం 28 వార్డుల్లో 19 చోట్ల కాంగ్రెస్ గెలుపు
— బీఆర్‌ఎస్ 4 వార్డుల్లో విజయం
— సీపీఐ-1, సీపీఎం-1, ఇండిపెండెంట్స్ – 3
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ – కాంగ్రెస్ కైవసం..
1వ వార్డు – కాంగ్రెస్ – ఇస్లావత్ తిరుపతి
2వ వార్డు – BRS – బానోత్ భద్రమ్మ
3వ వార్డు – BRS – బానోత్ కిషన్
4వ వార్డు – కాంగ్రెస్ – మెరుగు రాము
5వ వార్డు – BRS – బోడ భాస్కర్
6వ వార్డు – కాంగ్రెస్ – కలం సునీత
7వ వార్డు – కాంగ్రెస్ – మండం కాంతమ్మ
8వ వార్డు – కాంగ్రెస్ – ప్రగతి విసారపు
9వ వార్డు – కాంగ్రెస్ – గుగులోత్ నీలా
10వ వార్డు – BRS – బేబీ శ్రీ
11వ వార్డు – BRS – లావుడియా సత్యవతి (యుగంధర్)
12వ వార్డు – ఇండిపెండెంట్ – గంట్ల గౌతమ్ రెడ్డి
13వ వార్డు – BRS – గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి
14వ వార్డు – కాంగ్రెస్ – జాటోత్ సురేష్
15వ వార్డు – కాంగ్రెస్ – లునావత్ రమేష్
పార్టీ వారీగా మొత్తం:
కాంగ్రెస్ – 8
BRS – 6
ఇండిపెండెంట్ – 1
మొత్తం వార్డులు – 15
— చౌటుప్పల్ మున్సిపాలిటీలో మూడు పార్టీ హవా
— 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొససనం రాకేష్ రెడ్డి విజయం
— 2వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోలేపల్లి లక్ష్మీ గెలుపు
— 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పల్లె లావణ్య గెలుపు
— 4వ వార్డు BRS అభ్యర్థి ఉదరి యాదయ్య విజయం
— 5వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొయ్యడ శేఖర్ విజయం
— 6వ వార్డు బీజేపీ అభ్యర్థి అలె శ్రీలత చిరంజీవి 199 ఓట్లతో విజయం
ఎన్నికైన అభ్యర్థికి వెంటనే ఎలక్షన్ సర్టిఫికేట్ జారీ చేయాలి
రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అధికారిక ధృవీకరణ చేయాలి
Rule 63 ప్రకారం సర్టిఫికేట్ ఇవ్వడం తప్పనిసరి.
Form XXVII లో ఎలక్షన్ సర్టిఫికేట్ అందించాలి.
సర్టిఫికేట్ అందుకున్నట్టు అభ్యర్థి సంతకం అవసరం తప్పనిసరి
ఎన్నిక ఫలితాలు ప్రకటించిన వెంటనే ప్రక్రియ పూర్తి అవుతుంది.
ఎన్నికైన అభ్యర్థి అధికారికంగా గుర్తింపు పొందినట్లు ధృవీకరణ చేయాలి
రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో సర్టిఫికేట్ అందజేయాలి.
ఇప్పటికే అభ్యర్థులను క్యాంప్ లకు తరలించిన ఆయా పార్టీలు
— సూర్యాపేట జీల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ 9వార్డుల్లో విజయం
— బీఆర్ఎస్…05
— జనసేన- 1
— బిచ్కుంద మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
— మొత్తం 12 వార్డుల్లో 7 చోట్ల కాంగ్రెస్ విజయం
— ఒక వార్డులో బీఆర్‌ఎస్ గెలుపు
— ఇంకా నాలుగు వార్డుల్లో కొనసాగుతోన్న కౌంటింగ్
జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీ BRS కైవసం
— ఐజాలో మొత్తం వార్డులు 20
— BRS -13 వార్డుల్లో విజయం సాధిస్తే, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందారు.
— నల్లగొండ జిల్లా దేవరకొండ మునిసిపాలిటీ ఎన్ని కల ఫలితాలు చూద్దాం..
— 1వ వార్డ్ గుండాల అంజయ్య బిజెపి గెలుపు
— 2వ వార్డ్ BRS గెలుపు
— 9 వార్డ్ ముత్యాల చంద్రకళ BRS గెలుపు
— 15వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు
— 17 వార్డు బీఆర్ఎస్ పోట మధు గెలుపు
— 19వ వార్డు స్వతంత్ర అభ్యర్థి శ్రీధర్ గౌడ్ గెలుపు
— 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పులిజాల భవాని గెలుపు
— 20 వార్డ్ పున్న శైలజ కాంగ్రెస్ గెలుపు
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
హాలియా మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు
10 వార్డులు కాంగ్రెస్, 2 వార్డులు బీఆర్‌ఎస్ కైవసం
— మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 7 వార్డుల ఫలితాలు వచ్చాయి
— నాలుగు వార్డుల్లో BRS, మూడు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు
—
— మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు
— మక్తల్ 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అనిత విజయం
— 13వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవిందరావు విజయం
— ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ దూకుడు
— 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి నీలం కవిత విజయం
— 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి గోపాల్ గెలుపు
— 8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మాధవి నరేందర్‌రెడ్డి విజయం
— 9వ వార్డులో ఇండిపెండెంట్ వెంకటేష్ గెలుపు
యాదాద్రి జిల్లా మున్సిపాలిటీలో 1వ వార్డులో కాంగ్రెస్ గెలుపు
కాంగ్రెస్ అభ్యర్థి కొసననం రాకేష్ రెడ్డి తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి తొర్పునూరి మల్లేష్ పై విజయం సాధించారు.
వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో 1, 2 వ వార్డుల్లో కాంగ్రెస్ గెలుపు
పెబ్బేరు మున్సిపాలిటీ 6వార్డులో కాంగ్రెస్ విజయం.
3 వార్డులో బిఆర్ఎస్ గెలుపు
సంగారెడ్డి మున్సిపాలిటwలో బోణి కొట్టిన కాంగ్రెస్
23 వార్డు అభ్యర్థి కూన వనిత, 25 వార్డ్ లో ఆయేషా సుల్తానా విజయం
— భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు
— మూడు వార్డుల్లో కాంగ్రెస్ విజయం
— బీజేపీ ఒక వార్డులో.. బీఆర్‌ఎస్ ఒక వార్డులో గెలుపు
— ఒకచోట ఇండిపెండెంట్ విజయం
— మంచిర్యాలలో బోణి కొట్టిన CPI
— క్యాతపల్లి మున్సిపాలిటీలో విజయం
— 19వ వార్డు CPI అభ్యర్థి మిట్టపల్లి సరిత శ్రీనివాస్ గెలుపు
— 456 ఓట్లతో విజయం సాధించిన CPI అభ్యర్థి
— ఖమ్మంజిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో పోటాపోటీ
— అశ్వారావుపేటలో మొత్తం 22 వార్డులు
— కాంగ్రెస్ -02, BRS- 02, BJP-1
– ఉత్కంఠ రేపుతున్న అశ్వారావుపేట మున్సిపాలిటీ ఫలితాలు
— 4, 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
— 7, 14 వార్డుల్లో BRS గెలుపు
— 17వ వార్దులో BJP విజయం
నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ తొమ్మిదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కలిమికొండ పారిజాత జనార్ధన్ 160 ఓట్లపైగా మెజార్టీ తో విజయం
భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ మొదటి విజయం…..
1వ వార్డులో ఎనిమిది ఓట్లతో మొదటి వార్డు బీజేపీ విజయం
సంగారెడ్డి జిల్లా గడ్డపొతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం..
ఎన్నికల ఫలితాల్లో మొదటి మున్సిపాలిటీని గెలుచుకున్న బీఆర్ఎస్
మున్సిపాలిటీ వార్డులలో 10 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించగా.. 1 కాంగ్రెస్ అభ్యర్థి విజయం
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో 1వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి పల్లెర్ల వెంకన్న గుప్తా గెలుపు.
నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో బోణి కొట్టిన కాంగ్రెస్ పార్టీ 9వ వార్డు ఆర్కే విజయం
1,2,3,4,5,6,7,10, 11,12 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ముందంజ.
— ములుగు మున్సిపాలిటీలో కాంగ్రెస్ దూకుడు
— ములుగులో 5 వార్డుల్లో కాంగ్రెస్, 2 బీఆర్‌ఎస్ విజయం
— 1వ వార్డులో 278 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఆలోత్ పద్మ గెలుపు
— 3వ వార్డులో 212 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి వసంత విజయం
— 4వ వార్డులో 367 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి పావని గెలుపు
— 6వ వార్డులో 6 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చంద్రకళ విజయం
— హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జోరు
— ఐదు వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం
— 4, 5, 6, 7 వార్డుల్లో కాంగ్రెస్ ఘనవిజయం
— 4వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి విజయం
— 5వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలిశెట్టి రాజు గెలుపు
— 6వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ నాయక్ విజయం
— 7వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మారవీందర్ గెలుపు
జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సంగి ఆనంద్ విజయం.
— రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫలితాలు వేగంగా వస్తున్నాయి
— కాంగ్రెస్, BRS మధ్య పోటాపోటీ నెలకొంది
— రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ అమీన బేగం విజయం.
— మూడో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపు
— మూడో వార్డులో దాసరి మురళీ కృష్ణ విజయం సాధించారు
— వాస్తవానికి ఇతను కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించారు
— అయితే టికెట్ దక్కకపోవడంతో రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగారు
— ఇప్పటి వరకు అక్కడ ప్రకటించిన ఫలితాల్లో BRS ముందంజలో కనిపిస్తోంది
— 9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి దారు రాఘవేందర్ రావు విజయం సాధించారు
— 11, 12 వార్డులు BRS సొంతమయ్యాయి
— 11వ వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థి కొండ్రు శ్రీలత విజయం
— 12 వార్డు BRS అభ్యర్థి కొండ్రు త్రిలోక్ గెలుపు
— మూడో వార్డులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపు
— స్వతంత్రంగా పోటీకి దిగి దాసరి మురళీ కృష్ణ విజయం
— 7వ వార్డులో రీకౌంటింగ్ కొనసాగుతుంది
— ముందు లెక్కింపులో BRSకి 494, 491 కాంగ్రెస్‌కు ఓట్లు
— దీంతో మరోసారి రీకౌంటింగ్
— సీతారంపేటకు సంబంధించిన వార్డులో రీకౌంటింగ్ జరగుతోంది
— పోలింగ్‌కు ముందు రోజు ఇక్కడ గొడవ జరిగింది
— మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు
— ఎన్నికల సందర్భంగా తమ ఆవేదన తెలిపిన సూర్యాపేట రైతులు
— సూర్యాపేట పాత జాతీయ రహదారి బాధితులకు నష్టపరిహారం అందించాలి
— పేపర్‌పై రాసి బ్యాలెట్ బాక్స్‌లో వేసిన 48వ వార్డు ఓటర్లు
— ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తొలి ఫలితం
— 12వార్డు BRS అభ్యర్థి కొండ్రు త్రిలోక్ విజయం
— వంద ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం
— 11వ వార్డులోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థి విజయం
— మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ కౌంటింగ్ హాల్‌లో గందరగోళం
— మూడో వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సుకు లేని క్లాత్ ప్యాకింగ్
— కౌంటింగ్ ఆపాలని BJP, BRS అభ్యర్థుల ఆందోళన
– మధిర, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్
– లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఆధిక్యం
– ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ పోస్టల్ ఓట్లలో BJP లీడ్
– సంగారెడ్డి మున్సిపాలిటీలో 2 చోట్ల BRSకి పోస్టల్ ఓట్లలో ఆధిక్యం
– సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక వార్డులో MIM లీడ్
– ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడింగ్
– మంచిర్యాలల జిల్లా కేతనపల్లిలో కాంగ్రెస్ లీడింగ్
– కొమురంభీం జిల్లా: కాగజ్‌నగర్ పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ముందంజ
– ఐజ మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ ముందంజ
– గద్వాల్‌లో కాంగ్రెస్-BJPకి పోటాపోటీగా బ్యాలెట్ ఓట్లు
– వైరా మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ అధిక్యం
కొమురం భీం జిల్లా: కాగజ్ నగర్ వార్డ్ నెంబర్ 21 బీజేపీ అభ్యర్థి దూసారీ కృష్ణ వేణి విజయం.
కాంగ్రెస్ అభ్యర్థి జక్కు సంధ్య పై 370 ఓట్లతో బీజేపీ గెలుపు
నల్గొండ జిల్లా హాలియా మున్సిపాలిటీలో ఏడో వార్డు అభ్యర్థి చింతల చంద్ర రెడ్డి ఘనవిజయం.
నందికొండ మున్సిపాలిటీ 9 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఇర్ల రామకృష్ణ 163 ఓట్ల తో గెలుపు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఒకటో వార్డులో బీజేపీ అభ్యర్థి బోడ రాధ విజయం
నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ 14 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరసింహరావు 150 ఓట్ల మెజారిటీ తో విజయం.
ములుగు మున్సిపాలిటీలో తొలి ఫలితం వెల్లడి
1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఆలోతు పద్మ 278 ఓట్ల మెజారిటీతో విజయం..
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 వార్డులో BRS అభ్యర్థి మద్దెల మాధవి 39 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత భుజంగ రెడ్డి గెలుపు
— మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగిరానున్న సీఎం రేవంత్
— మధ్యాహ్నం 2:40 కల్లా హైదరాబాద్ చేరుకోనున్న రేవంత్‌రెడ్డి
— హైదరాబాద్ రాగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మానిటరింగ్
— ప్రస్తుతం ఢిల్లీ నుంచే మున్సిపల్ ఫలితాలపై మానిటరింగ్ చేస్తోన్న రేవంత్
— మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ ధీమా
— మున్సిపోల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని ఇప్పటికే అధిష్ఠానానికి రేవంత్ రిపోర్ట్
— నిన్న రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై రిపోర్ట్ ఇచ్చిన రేవంత్
– మధిర, నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ లీడ్
– లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఆధిక్యం
– ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ పోస్టల్ ఓట్లలో BJP లీడ్
– సంగారెడ్డి మున్సిపాలిటీలో 2 చోట్ల BRSకి పోస్టల్ ఓట్లలో ఆధిక్యం
– సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక వార్డులో MIM లీడ్
– ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్ లీడింగ్
ఆదిలాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ
నిర్మల్ జిల్లా: నిర్మల్, ఖానాపూర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపి ముందంజ
మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్ లలో పోస్టల్ బ్యాలెట్ లలో కాంగ్రెస్ ముందంజ
కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ
మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం జిల్లా ఏదులా పురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
— నాగర్ కర్నూల్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి
— పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
— కాంగ్రెస్‌కు 17, బీఆర్‌ఎస్‌కు 06 పోస్టల్ ఓట్లు
— బీజేపీకి 04, ఇండిపెండెంట్ 02 పోస్టల్ ఓట్లు
— సంగారెడ్డి మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
— మొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం
— 2 వార్డుల్లో BRS ఆధిక్యం
— వార్డు నెంబర్ 2, 3, 4, 6, 7, 23, 26, 35, 36, 37, 38లో కాంగ్రెస్ లీడ్
— 1, 25 వార్డుల్లో BRS లీడ్
— 24వ వార్డులో MIM లీడ్
– మక్తల్ మున్సిపాలిటీలో 43 మంది పోస్టల్ ఓట్లు నమోదు చేసుకున్నారు.
– ఐతే.. వీటిల్లో 39 పోస్టల్ పోల్ అయ్యాయి.
– ఈ ఓట్లలో ఎవరికి ఆధిక్యం వచ్చింది అది కాసేపట్లో తేలబోతోంది.
– మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అభ్యర్థి మృతి
– 10 వార్డ్ బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో ఉదయం మృతి
– మధిర మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు
– పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్‌కి ఆధిక్యం
— మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ ధీమా
— ఢిల్లీ నుంచే మున్సిపల్ ఫలితాలపై మానిటరింగ్ చేస్తోన్న రేవంత్
— ఢిల్లీలోనే ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి
— మున్సిపోల్స్‌లో కాంగ్రెస్‌దే విజయమని ఇప్పటికే అధిష్ఠానానికి రేవంత్ రిపోర్ట్
— నిన్న రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై రిపోర్ట్ ఇచ్చిన రేవంత్
— మూడోరోజూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి
— నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ చేసిన రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
— రాబోయే పదిన్నరేళ్లు సీఎం కుర్చీ తనదే అన్నారు రేవంత్.. తనను టచ్ చేసేవారే లేరన్నారు
— తెలంగాణకు నేనే రాజు..నేనే మంత్రి అంటూ సినీ స్టైలులో కామెంట్స్ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
— తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్‌లకు పోలింగ్
— మొత్తం 2595 వార్డుల్లో 14 ఏకగ్రీవం
— 12 కాంగ్రెస్ సొంతం, 2 BRS వశం
— కాంగ్రెస్ సొంతమైన వాటిలో 7 ఉమ్మడి నల్గొండ జిల్లావే
— రామగుండం, మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లలో రెండు డివిజన్‌లు ఏకగ్రీవం కాగా.. అవి రెండు కాంగ్రెస్ సొంత మయ్యాయి.
— కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో గందరగోళం
— స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టిన అధికారులు
— గడ్డ పారతో తాళాన్ని పగలగొట్టిన అధికారులు