Malla Reddy: కష్టపడ్డ.. పూలమ్మిన .. పాలమ్మిన మంత్రి.. 30 ఏళ్ల నాటి వ్యక్తిగా మారిపోయారు..!

|

Oct 24, 2023 | 1:13 PM

మల్లారెడ్డి... మంత్రి మల్లారెడ్డి.. ఏం చేసిన సెన్సేషనల్.. పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డ.. ఈ ఒక్క డైలాగ్ చాలు ఆ మాస్‌ మంత్రి క్రేజ్ ఏంటో తెలుసుకోవడానికి.. మినిస్టర్‌గా కంటే పంచింగ్‌ ప్రసంగాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారాయన. ఇప్పుడు అదే మల్లారెడ్డి తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. దసరా పండుగ రోజున ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు.

Malla Reddy: కష్టపడ్డ.. పూలమ్మిన .. పాలమ్మిన మంత్రి..  30 ఏళ్ల నాటి వ్యక్తిగా మారిపోయారు..!
Minister Mallareddy
Follow us on

మల్లారెడ్డి… మంత్రి మల్లారెడ్డి.. ఏం చేసిన సెన్సేషనల్.. పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డ.. ఈ ఒక్క డైలాగ్ చాలు ఆ మాస్‌ మంత్రి క్రేజ్ ఏంటో తెలుసుకోవడానికి.. మినిస్టర్‌గా కంటే పంచింగ్‌ ప్రసంగాలతోనే ఎక్కువ ఫేమస్ అయ్యారాయన. ఇప్పుడు అదే మల్లారెడ్డి తన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో చూపించే ప్రయత్నం చేశారు. దసరా పండుగ రోజున ప్రత్యేకంగా పూజలు కూడా చేశారు.

మంత్రి మల్లారెడ్డి తన పాత రోజుల్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. దసరా సందర్భంగా 30 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. బోయిన్ పల్లిలో దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న వాహనాలన్నింటిని ఒకే దగ్గర ఉంచి పూజలు చేశారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన పాత స్కూటర్‌కు సైతం తీసుకువచ్చారు. ఇన్నాళ్ళ తరువాత కూడా చక్కచెదరకుండా ఉన్నా అదే స్కూటర్‌ నడుపుతూ చక్కర్లు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. 30 సంవత్సరాల క్రితం అదే స్కూటర్‌పై తిరుగుతూ పాలు అమ్మిన రోజుల్ని అందరితో పంచుకున్నారు.

గతంలో ఎన్నో సందర్భాల్లో పూలమ్మిన, పాలమ్మిన, కష్టపడ్డ.. మంత్రి మల్లారెడ్డి చెప్పిన మాటలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే స్కూటర్‌పైనే చక్కర్లు కొట్టి సరదా గడిపి ఎంజాయ్ చేశారు. ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకున్న మంత్రి.. అనాటి స్కూటర్ చేతక్‌ బండి కనిపించగానే హుషారుగా షికారు చేశారు మంత్రి మల్లారెడ్డి.

తెలంగాణ రాజకీయాల్లో మంత్రి మల్లారెడ్డిది ఓ ప్రత్యేకత. తెల్లటి చొక్కా వేసుకుని అసెంబ్లీలో నిలబడి..మస్త్‌ ముచ్చట్లు చెప్పారు మన మల్లారెడ్డి. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వరకు ప్రతిపక్షాలను, ప్రధాన మంత్రిని.. ఎవరినీ వదల్లేదు. అందరిని పేరుపేరునా వాయనాలు ఇచ్చారు. వడ్డింపులు చేశారు. సెటైర్లతో నవ్విస్తూ.. చురకలు వేస్తారు. ఆయన మాటలు మతాబులే. సామెతలు చెబితే చిచ్చుబుడ్లే.. పంచ్‌ డైలాగులు విసిరితే పటాస్‌లే.. మధ్యలో స్వామిభక్తి మస్ట్‌.. ఎక్కడ అవకాశం దొరికినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు.

పాల వ్యాపారంతో మొదలైన ఆయన ప్రస్థానం ఎన్నో విద్యా సంస్థలు, వ్యాపారాల స్థాపించారు. మొదటిసారిగా తెలుగు దేశం పార్టీలో చేరి మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్‌లో చేరి.. మేడ్చల్ నుంచి విజయం సాధించి మంత్రి అయ్యారు. మరోసారి మేడ్చల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…