Minister KTR: కాంగ్రెస్ ముఖ్య నాయుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. రాహుల్ పర్యటనపై సెటైర్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు.’’ అంటూ తనదైన రీతిలో పంచ్ వేశారు. ఆ డైలాగ్‌కు తగ్గట్లుగానే మేనరిజం ఉన్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేశారు. ఎవరు వచ్చినా తగ్గేదే లే అని పంచ్ పేల్చారు.
ఇదిలాఉంటే.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ తన కార్యాచరణను ప్రారంభించింది. ఇందులో భాగంగానే వరంగల్ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. రైతు సమస్యలపై ప్రసంగించడమే కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై కూడా డిక్లరేషన్ ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య పొత్తు కొనసాగుతుందని ఆరోపించారు రాహుల్ గాంధీ.
Political tourists will come and go?
Only KCR Garu here to stay in #TELANGANA pic.twitter.com/dP5iBWidGN
— KTR (@KTRTRS) May 6, 2022