Dalitha Bandhu: దేశానికే ఆదర్శం దళితబంధు పథకం.. లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రులు..

|

Aug 26, 2021 | 10:07 PM

Telangana Ministers: దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేస్తుందని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు.

Dalitha Bandhu: దేశానికే ఆదర్శం దళితబంధు పథకం.. లబ్ధిదారులకు వాహనాలు అందజేసిన మంత్రులు..
Ministers
Follow us on

Telangana Ministers: దళితుల సంక్షేమానికి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్ధతతో పనిచేస్తుందని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ అన్నారు. దీనికి నిదర్శనమే తాజాగా తీసుకువచ్చిన దళిత బంధు పథకం అని చెప్పుకొచ్చారు. గురువారం నాడు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో దళితబంధు లబ్ధిదారులకు నాలుగు యూనిట్లు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్.. దళితుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఘనతను పేర్కొన్నారు. నిన్నటి వరకు ఒకరి దగ్గర డ్రైవర్‌గా పని చేసిన దళితులు.. నేడు అదే వాహనానికి ఓనర్‌గా మారడం దళితబంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం ‘దళితబంధు’ ను కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలేట్ ప్రాజెక్టుగా ఈ నెల 16న ప్రారంభించి.. ఇదే నెలలో లబ్ధిదారులకు వాహనాలందించడం అభినందనీయం అని అన్నారు. దళితబంధు పథకానికి ఇప్పటి వరకు 1500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం ద్వారా హుజరాబాద్ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని మంత్రులు తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు అందించి, వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తోందని పేర్కొన్నారు. మొదటి విడుతగా దళితబంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సీఎం కేసీఆర్ అందజేశారని, ప్రస్తుతం నాలుగు యూనిట్ల కింద నేడు లబ్ధిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేశామని మంత్రులు తెలిపారు. దళితబంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిందని మంత్రులు వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈర్షపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కృషి చేస్తోందిన మంత్రులు చెప్పుకొచ్చారు. దళితబంధు దేశానికే ఆదర్శం అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కన్న కళలను ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేస్తున్నారని కొనియాడారు.

Also read:

Vijayanagaram: విజయనగరంలో మునిసిపల్ అధికారుల ఓవరాక్షన్.. పీఠల మీది పెళ్లిని ఆపి మరీ..

Telangana Dalitha Bandhu: దళిత రాగం తీస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. పాలనలో ఊహించని మార్పులు..!

మానవులు ఏలియన్స్‏గా మారిపోవచ్చా ? ఈ పని చేస్తే అయ్యే అవకాశం ఉందంటున్న నిపుణులు..