Minister Harish Rao: కాంగ్రెస్, బీజేపీపై మరోసారి హాట్‌హాట్ కామెంట్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు. కాంగ్రెస్ కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్ అయితే, బీజేపీ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టే పార్టీ అని విమర్శలు గుప్పించారు. గజ్వేల్‌లో జరిగిన రైతు సభలో పాల్గొన్న ఆయన మీడియాతో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగానికి దీటుగా రైతులకు డిమాండ్ ఉందన్నారు మంత్రి హరీష్‌రావు. దేశంలో అత్యధిక పంటలు పండే రాష్ట్రంగా తెలంగాణ ఉందని, రైతు బీమా పథకం ద్వారా రైతుల ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు. బోర్లకు మీటర్లు పెట్టని రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. ఇక గజ్వేల్‌లో వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశంలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై పంచ్‌లు వేశారు మంత్రి హరీశ్‌రావు. కాంగ్రెస్ అంటే కాలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు అని, బీజేపీ అంటే మోటర్ల దగ్గర మీటర్లు పెట్టేదని, టీఆర్‌ఎస్ అంటే 24 గంటల కరెంట్ అని వివరించారు హరీశ్.
తెలంగాణ అభివృద్ధికి కొందరు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. వ్యవసాయంపై ఆధారపడి 58 శాతం మంది ఉన్నారని, అందుకే కేసీఆర్ వ్యవసాయానికి పెద్దపీట వేశారని వివరించారు. భిన్న పంటల సాగుకు సంగారెడ్డి జిల్లా అనువైనదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ ఏడాది పత్తి, పప్పులు, నూనె గింజల సాగు పెంచాలని, అలా చేస్తే, ప్రతీనెలా జీతంలా రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని వివరించారు వ్యవసాయ శాఖ మంత్రి. కొందరి నిర్లక్ష్యం వల్ల స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలుకు నోచుకోలేదని చెప్పారు నిరంజన్ రెడ్డి.