Liquor Prices: ఈ దెబ్బతో మందుబాబులకు కిక్కు దిగాల్సిందే.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు..! ఒకేసారి ఎంతంటే..?

తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్ లిక్కర్‌తో పాటు మిడిల్ స్థాయి, ప్రీమియం బ్రాండ్ల ధరలను పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ క్షణమైనా అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో మందుబాబులపై మరింత భారం పడనుంది.

Liquor Prices: ఈ దెబ్బతో మందుబాబులకు కిక్కు దిగాల్సిందే.. తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంపు..! ఒకేసారి ఎంతంటే..?
Liquor

Updated on: Jul 17, 2026 | 7:28 AM

తెలంగాణలోని మందుబాబులకు కిక్కు దిగే న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. నేడో, రేపే దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేయనుంది. ధరలు పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. మద్యం ధరల పెంపునకు సంబంధించి రేవంత్ సర్కార్ ఓ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల వివిధ మద్యం తయారీ కంపెనీలతో సమావేశమైంది. అనంతరం పెరుగుతున్న ఖర్చుల కారణంగా మద్యం ధరలను పెంచాల్సిందేనని కమిటీ ఓ నివేదిక సమర్పించింది. ఈ రిపోర్ట్ పరిశీలన అనంతరం.. మద్యం కంపెనీల డిమాండ్ల మేరకు ధరలను పెంచేందుకు రాష్ట్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మందుబాబులపై ఇది భారాన్ని మోపనుంది. దాదాపు 20 శాతం మేరకు ధరలను పెంచనున్నారని తెలుస్తోంది.

మద్యం ధరలు ఎంత పెరగనున్నాయంటే..?

మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. చీప్‌ లిక్కర్‌తో పాటు మీడియం, ప్రీమియం, హయ్యర్‌ క్యాటగిరీ అన్ని బ్రాండ్ల ధరలను పెంచనున్నారు. ప్రీమియం బ్రాండ్లకు సంబంధించి ఫుల్‌బాటిల్‌పై రూ.100 వరకు పెరిగే అవకాశముండగా.. హయ్యర్‌ క్యాటగిరీ బ్రాండ్లపై రూ.120 పెరిగే ఛాన్స్ ఉంది. ఇక ఎక్కువమంది కొనుగోలు చేసే చీప్‌ లిక్కర్‌ బ్రాండ్లపై రూ.90 వరకు పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ధరల పెంపుతో మద్యం కంపెనీల ఆదాయం పెరగనుండగా.. ప్రభుత్వం ఖజానాకు కూడా అధిక నిధులు అందనున్నాయి. అయితే మందుబాబులకు మాత్రం దీని వల్ల బాదుడు తప్పదు. మద్యం సేవించాలంటే ఇక ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. మద్యం ధరలను పెంచాలని ప్రభుత్వాన్ని తయారీదారులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ 11 సార్లు కంపెనీలతో చర్చలు జరిపింది. అనంతరం ప్రభుత్వానికి కీలక నివేదికను సమర్పించింది.

మందుబాబులకు గుడ్ న్యూస్ ఇదే..

ధరల పెంపు అలా ఉండగా.. ఈ సందర్భంగా మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించనుంది. కొత్తగా 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం బాటిల్లను కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ సైజు బాటిల్స్‌ను ప్రవేశపెట్టింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీని వల్ల మందుబాబులకు మరిన్ని సైజుల్లో మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయి. రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండుసార్లు లిక్కర్ రేట్లను పెంచారు. గత ఏడాది ఫిబ్రవరిలో బీర్ ధరలను పెంచింది. రూ.30 నుంచి రూ.50 మేర బీర్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక మేలో లిక్కర్ ధరలను క్వార్టర్‌పై రూ.10, హాఫ్‌పై రూ.20, ఫుల్‌బాటిల్‌పై రూ.40 చొప్పున ధరలు పెంచింది

Follow Us