Telangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌ ఢీకొనడంతో..

|

Jul 03, 2022 | 6:32 PM

Telangana: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో

Telangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. కాన్వాయ్‌ ఢీకొనడంతో..
Gutha Sukender Reddy
Follow us on

Telangana: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి నల్లగొండకు వస్తుండగా.. రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుత్తా సుఖేందర్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. కాగా, కాన్వాయ్‌లోని మూడు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దాంతో గుత్తా సుఖేందర్ రెడ్డి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.