Inter Exam Model Papers : కోవిడ్ లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ సిలబస్‌ను 70 శాతానికే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంటర్ పరీక్షల ప్రశ్నాపత్రాల్లో స్వల్ప మార్పులు చేశారు. ఈ మేరకు ఇంటర్ మోడల్ పేపర్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అన్ని సబ్జెక్టుల ప్రశ్నాపత్రాల్లో మార్పులు చేసినట్లు తెలిపింది.
రెండు మార్కుల ప్రశ్నలు పదింటికి పది రాయాల్సి ఉంటుందని… 4 మార్కులు, 8 మార్కుల ప్రశ్నల్లో మార్పులు చేశారు. మోడల్ పేపర్స్ కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చని ఇంటర్మిడియట్ బోర్డు పేర్కొంది.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టుగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 1 నుంచి 19 వరకు ప్రథమ సంవత్సరం, మే 2 నుంచి 20 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్నల్ పరీక్షలయిన ఎథిక్స్ అండ్ హ్యుమన్ వ్యాల్యూస్ పరీక్షను ఏప్రిల్ 1న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహించనున్నామని చెప్పారు.
ఇవి కూడా చదవండి
ఏడాది గడిచిన అదే జోరు.. వ్యాక్సిన్ వచ్చిన తగ్గని తీవ్రత.. మాయదారి మహమ్మారికి అంతమెప్పుడు..?
Farm Laws: ఆ చట్టాలు.. రైతులు, కార్మికులకే కాదు.. యావత్ దేశానికి ప్రమాదకరం: రాహుల్ గాంధీ