Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మొత్తం ఎంత మంది పాస్‌ అయ్యారు.? ఏ జిల్లా మొదటి స్థానంలో నిలచింది.?

|

May 09, 2023 | 12:29 PM

TS Inter 1st, 2nd Year Results 2023 Live Updates: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌. గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఫలితాలను ఎట్టకేలకు మంగళవారం విడుదల చేశారు. తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డ్ కార్యాలయంలో 11 గంటలకు ఫలితాలను విడుదల చేశారు..

Telangana Inter Results 2023: తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో మొత్తం ఎంత మంది పాస్‌ అయ్యారు.? ఏ జిల్లా మొదటి స్థానంలో నిలచింది.?
Telangana Inter Results Live

TS Inter 1st, 2nd Year Results 2023: తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాసేపటి క్రితమే విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డ్‌ కార్యాలయంలో ఫలితాలను విడదుల చేశారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను విడుదల చేశారు. రెండింటిలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరుకాగా వీరిలో 2,72,208 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది A గ్రేడ్‌లో పాస్‌కాగా, 68,335 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. అమ్మాయిలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలు 56.82 శాతం మంది పాస్‌ అయ్యారు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

ఇక సెకండ్‌ ఇయర్‌ విషయానికొస్తే.. మొత్తం 3,80,920 మంది హాజరుకాగా 2,56,241 మంది పాస్‌ అయ్యారు. సెకండ్‌ ఇయర్‌లో మొత్తం 67.26 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో లక్ష 73వేల మంది A గ్రేడ్‌లో పాస్‌ కాగా, 54,786 మంది B గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించారు. ఇక అమ్మాయిలు 73.46 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అబ్బాయిలుల 60.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌ కోర్సుల విషయానికొస్తే ఫస్ట్‌ ఇయర్‌లో మొత్తం 2,55,533 మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్‌ ఇయర్‌లో 28738 మంది పాస్‌ అయ్యారు.

ఇదలా ఉంటే.. ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించని వారికి జూన్‌ 4 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్ల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 May 2023 12:07 PM (IST)

    సప్లీ ఎగ్జామ్స్‌ ఎప్పటినుంచంటే..

    ఇంటర్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఉత్తీర్ణత సాధించని వారికి జూన్‌ 4 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్ల మంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు. మే 10 నుంచి మే 16 వరకు రీకౌంటింగ్‌, రీ వాల్యూయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని.. విద్యార్థులు, తల్లిదండ్రులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. విద్యార్థులపై ఒత్తిడి ఉండకూడదనే ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కుల వెయిటేజీ తొలిగించినట్లు మంత్రి చెప్పారు.

  • 09 May 2023 11:39 AM (IST)

    తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..

  • 09 May 2023 11:37 AM (IST)

    దుమ్మురేపిన గురుకుల విద్యార్థులు..

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గురుకుల కాలేజీల్లో మొత్తం 92 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. ఇక ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్‌ కాగా.. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత, KGBV 77%, ట్రైబల్ 84 %, ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

  • 09 May 2023 11:34 AM (IST)

    బాలికలదే పైచేయి..

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలకలదే పైచేయిగా నిలిచారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 68 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, 56.82 శాతం మంది అబ్బాయిల పాస్‌ అయ్యారు. ఇక సెకండ్‌ ఇయర్‌లో 73.46 శాతం మంది అమ్మాయిలు, 60.66 శాతం మంది అబ్బాయిలు పాస్‌ అయ్యారు.

  • 09 May 2023 10:45 AM (IST)

    ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి సబితా..

  • 09 May 2023 10:39 AM (IST)

    ఆటంకాలు లేవని నిర్ధారణ అయ్యాకే..

    ఫలితాల విడుదల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురుకాకూడదనే ఉద్దేశంతో అధికారులు.. పలు దఫాలుగా ట్రయల్‌రన్‌ చేశారు. అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని. దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మరికాసేపట్లో ఫలితాలను విడుదల చేయనున్నారు.

  • 09 May 2023 10:24 AM (IST)

    ఎంత మంది పరీక్ష రాశారంటే..

    ఈ ఏడాది మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలు రాశారు. 5 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 4.5 లక్షల మంది సెకండ్‌ ఇయర్‌ ఎగ్జామ్స్‌కు హాజరయ్యారు. ఇదిలా ఉంటే రేపటి నుంచి తెలంగాణలో ఎంసెట్‌ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే.

  • 09 May 2023 10:06 AM (IST)

    ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి..

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు. నాంపల్లిల్లోని ఇంటర్ బోర్డ్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారు. రిజల్ట్స్‌ను www.tv9telugu.comలో చూడొచ్చు

Follow us on