
తెలంగాణ రాజ్‌భవన్‌లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గవర్నర్ తమిళసై రాజ్‌భవన్ ఉద్యోగులు, సిబ్బంది వారి కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. రంగవల్లులు వేసి, చెరుకు గడలను ఏర్పాటు చేసి అందులో పొంగల్ తయారు చేశారు. రకరకాల పూలతో ఇంటిని అందంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేసిననంతరం తెలంగాణ ప్రజలకు సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని కాంక్షించారు. ఈ సారి సంక్రాంతి వేడుకలు పూర్తైన వారం రోజులకు అయోధ్యలోని శ్రీరాముని మందిరం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుందన్నారు. అందుకే ఈ ఏడాది సంక్రాంతి ప్రత్యేకం అన్నారు. త్వరలో రామ్ మందిర్‌కి సంబంధించిన తెలుగు, హిందీ పాటలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా తన ఢిల్లీ పర్యటన గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి పండుగ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ వెళ్తున్నానన్నారు. ఇది రాజకీయ పరమైన పర్యటన కాదని స్పష్టం చేశారు. దీనికి కారణం గతంలో ఆమె ఢిల్లీ పర్యటించినప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా తమిళనాడు నుంచి పోటీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ తమిళి సై కొట్టిపరేశారు. అవన్నీ ఉత్తి వదంతులే అని వివరించారు. అలాంటివి ఏవైనా ఉంటే ముందుగానే తెలియజేస్తానన్నారు.
Celebrated #Pongal / #Sankranti Festival at Raj Bhavan Pariwar #Hyderabad ,#Telangana
with Sr Officials & staff.#హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాజ్‌భవన్ సిబ్బందితో కలిసి పొంగల్/సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.#HappyPongal #HappySankranthi pic.twitter.com/Bq1FAifY62— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) January 13, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..