Telangana Govt: తెలంగాణ పాఠశాల విద్యార్థులకు శుభవార్త.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..

|

Mar 20, 2021 | 11:16 AM

Telangana Govt: రాష్ట్రంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యార్థులకు మేలు

Telangana Govt: తెలంగాణ పాఠశాల విద్యార్థులకు శుభవార్త.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి..
Telangana Government
Follow us on

Telangana State Government: రాష్ట్రంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. విద్యార్థులకు మేలు చేసేలా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరలో పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ అందించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఉచితంగా స్టడీ మెటీరియల్స్ ఇవ్వాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్నారు. మంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 2.20 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం ఉచితంగా మెటీరియల్ పంపిణీ చేయనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరట కలుగనుంది. కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిలబడిపోయాయి. ఈ సంక్షోభం నేపథ్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కొనిచ్చే పరిస్థితిలో దాదాపు చాలా కుటుంబాలు లేవనే చెప్పాలి. ప్రభుత్వం ప్రజల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ లైవ్ కింది వీడియోలో చూడొచ్చు..

Also read: Google Doodle: ‘వసంత ఋతువు’కు ప్రత్యకంగా స్వాగతం పలికిన గూగుల్.. అందమైన యానిమేటెడ్ వీడియోతో డూడుల్..

Hyderabad Cop: ఉన్నత చదువులు చదివాడు.. టీచర్‌గానూ పని చేశాడు.. చివరికి బేకార్ పనులు చేసి అడ్డంగా బుక్కయ్యాడు..

AP SEC Nimmagadda: నిమ్మగడ్డ మరో సంచలనం.. గవర్నర్‌తో చర్చిస్తున్న విషయాలు లీకవుతున్నాయంటూ హైకోర్టులో పిటిషన్