NIMS Expansion: నిమ్స్‌కు మహర్దశ.. ఆస్పత్రి విస్తరణకు భారీగా నిధులు కేటాయించిన తెలంగాణ సర్కార్..

Telangana NIMS: నిమ్స్ విస్తర‌ణ‌కు నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్య తెలంగాణకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 10వేల పడకల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది

NIMS Expansion: నిమ్స్‌కు మహర్దశ.. ఆస్పత్రి విస్తరణకు భారీగా నిధులు కేటాయించిన తెలంగాణ సర్కార్..
Nims
Follow us

|

Updated on: Nov 17, 2022 | 8:38 AM

నిమ్స్ విస్తర‌ణ‌కు నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఆరోగ్య తెలంగాణకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రంలో 10వేల పడకల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ప్రాధాన్యతా క్రమంలో అడుగులు వేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. ఈ నేప‌థ్యంలో నిమ్స్ విస్తర‌ణ‌కు ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. 2000 పడకల నిమ్స్ విస్తరణ 1,571 కోట్ల నిధుల‌ను కేటాయిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నిమ్స్ విస్తర‌ణ ప్రాజెక్టుకు ప‌రిపాల‌న అనుమ‌తుల‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే నిమ్స్ లో 1800 పడకలు ఉన్నాయి. మరో 200 పడకలు ఏర్పాటుకు నిధులు మంజూరు చేసింది. 4వేల పడకలతో నగరం నలువైపులా నాలుగు టిమ్స్, వరంగల్‌లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటుంది.

కాగా, నిమ్స్ విస్తరణపై మాట్లాడిన రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు.. ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడిందన్నారు. నిమ్స్ విస్తర‌ణ‌కు రాష్ట్ర ప్రభుత్వం 1,571 కోట్ల నిధులు కేటాయించ‌డంపై మంత్రి హరీశ్‌ హ‌ర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజ‌ల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తుందని ప్రశంసించారు హరీశ్. ఆరోగ్య రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తున్నారని.. ఆరోగ్య తెలంగాణ కోసం తీసుకుంటున్న చ‌ర్యల్లో ఈ నిర్ణయం మ‌రో ముంద‌డుగు అంటూ ట్వీట్టర్ లో ప్రశంసించారు మంత్రి హరీశ్. రాబోయే రెండేళ్లో 33 జిల్లాల్లో 33 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురాబోతున్నామన్నామని చెప్పారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి హరీశ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..