Telangana: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. మార్చి 8న కొత్త స్కీమ్.. ప్లానింగ్ అదుర్స్ అంతే

మహిళలను కాపాడుకుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. వారు క్షేమంగా ఉంటే.. ఇల్లంతా క్షేమంగా ఉంటుంది. అందుకే మహిళల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది తెలంగాణ సర్కార్.

Telangana: మహిళలకు అండగా తెలంగాణ సర్కార్.. మార్చి 8న కొత్త స్కీమ్.. ప్లానింగ్ అదుర్స్ అంతే
Telangana Map
Follow us

|

Updated on: Mar 04, 2023 | 9:17 PM

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న తెలంగాణ ప్రభుత్వం “ఆరోగ్య మహిళ” కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. ఇందుకోసం సీఎం సూచనల మేరకు వైద్యారోగ్య శాఖ సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. మహిళలు ప్రధానంగా ఎదుర్కునే 8 రకాల ఆరోగ్య సమస్యలపై వైద్యారోగ్య శాఖ ఫోకస్ పెట్టింది.  ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మహిళలకు బహుమతిగా ఈ హెల్త్ స్కీమ్ తీసుకొస్తుంది.  ప్రతి మంగళవారం మహిళలకు ప్రత్యేక వైద్య సేవలు అందించబోతుంది. మొదటి దశలో 100 ఆరోగ్య కేంద్రాల్లో ఈ సేవలు ప్రవేశ పెట్టనున్నారు మొత్తం 1200  పీహెచ్ సి, యూపిహెచ్‌సీ, బస్తి దావాఖనా కేంద్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.

  1. మధుమేహం, రక్తపోటు, రక్తహీనత, ఇతర సాధారణ పరీక్షలు
  2. ఓరల్, సర్వైకల్, రొమ్ము క్యాన్సర్ల స్క్రీనింగ్..
  3. .థైరాయిడ్ పరీక్ష, సూక్ష్మ పోషకాల లోపాలను గుర్తించడం. అయోడిన్ సమస్య, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపంతో పాటు, విటమిన్ బీ12, విటమిన్ డి పరీక్షలు చేసి చికిత్స, మందులు అందజేస్తారు.
  4.  మూత్రకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ వ్యాధుల పరీక్షలు చేస్తారు.
  5. మెనోపాజ్ దశకు సంబంధించి పరీక్షల అనంతరం అవసరమైన వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయడంతోపాటు కౌన్సిలింగ్ తో అవగాహన కలిగిస్తారు.
  6. నెలసరి సమస్యలపై పరీక్షలు చేసి వైద్యం అందిస్తారు. సంతాన సమస్యలపై ప్రత్యే కంగా పరీక్షలు చేసి అవగాహన కలిగించడం, అవసరమైనవారికి ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేస్తారు.
  7. సెక్స్ సంబంధిత అంటువ్యాధుల పరీక్షలు చేసి అవగాహన కలిగిస్తారు. అవసరమైన వారికి వైద్యం అందిస్తారు.
  8.  బరువు నియంత్రణ, యోగా, వ్యాయామం వంటివాటిపై అవగాహన కలిగిస్తారు.

ఈ పరీక్షలు అన్నీ  ఉచితంగానే చేస్తారు. ప్రత్యేక యాప్ ద్వారా మానిటరింగ్ ఉంటుంది.  తెలంగాణ డయాగ్నొస్టిక్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు చేస్తారు. సమస్యలు ఉన్నవారిని రెఫరల్ సెంటర్లు, ప్రభుత్వ పెద్దాసుపత్రులకు పంపుతారు. సంబంధిత మహిళకు పూర్తిగా నయం అయ్యే దాకా వైద్య సేవలు అందించే కార్యక్రమం ఉంటుంది. రిఫరల్ ఆసుపత్రుల్లో మహిళలకు సేవలు పొందేందుకు వీలుగా ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఉంటాయి. ఈ ప్రత్యేక సేవల గురించి మహిళా సంఘాలు, మెప్మా వారికి అవగాహన కల్పించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
మీరూ ఆఫీస్‌లో గంటల తరబడి ఒకే చోట కూర్చుని పనిచేస్తున్నారా?
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
రెండుసార్లు బ్రేకప్.. అలాంటి వ్యక్తులంటే అస్సలు నచ్చదు.. తమన్నా..
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
మూడుసార్లు మడతపెట్టే ఫోన్‌.. హువాయ్‌ సంచలనం
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
వాయుగుండం ఎఫెక్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వెదర్ రిపోర్ట్
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
మీ పాపాయితో కలిసి టూర్‌కి వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
డయాబెటిస్‌ను 7 రోజుల్లో తరిమేసే అద్భుత గింజలు.. ఇకపై పడేయకండే!
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
ఎగ్ కీమా మసాలా.. చపాతీలతో తింటే అదిరిపోతుంది..
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
'వేదం' సినిమాలో మంచు మనోజ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
పెట్టుబడికి పెద్ద భరోసా.. ఆ పథకంతో బోలెడు ప్రయోజనాలు
పెట్టుబడికి పెద్ద భరోసా.. ఆ పథకంతో బోలెడు ప్రయోజనాలు
మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది.?
మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది.?