అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు’ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పలు రంగాలకు చెందిన మొత్తం 27 మంది మహిళలను ఈ స్పెషల్ అవార్డుల కోసం ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఏడాది(2023) సందర్భంగా మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ప్రతి ఒక్కరికి 1 లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని సర్కార్ అందజేయనున్నామని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.
అవార్డులు పొందిన మహిళలు వీరే..
బానోతు జ్యోతి – అంగన్‌వాడీ టీచర్
గుండా రాజకుమారి – సెంటర్ కోఆర్డినేటర్, భరోసా సెంటర్
ఆల్ఫి కిండన్‌జెన్ – సోషల్ సర్వీస్
మీనాక్షి గాడ్గె – ముఖ్రా కే సర్పంచ్
సుజాత దీక్షిత్ – థియేటర్
స్వరూప పొట్లపల్లి – జర్నలిజం
డాక్టర్ బండారు సుజాత శేఖర్ – ఫోక్ లిటరేచర్
అరుణ నారదభట్ల – లిటరేచర్
డాక్టర్ అమూల్య మల్లన్నగారి – హెల్త్
నారా విజయలక్ష్మి(పీహెచ్) – పెయింటర్
ఓఎన్ఐ సిస్టర్స్(వినోద, విజయ, విజయలక్ష్మి) – మ్యూజిక్