
హైదరాబాద్, జులై 30: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం మహిళలు చిన్నపిల్లల సంరక్షణ కి పెద్ద పీట వేశారు. దీనికోసం పోలీస్ శాఖలో ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని అడిషనల్ డీజీ హోదాలో నియమించి ప్రత్యేక ప్రణాళికలను రచించారు. ప్రస్తుతం షికా గోయల్ ఉమెన్ సేఫ్టీ వింగ్ కి అడిషనల్ డీజీగా ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా లెక్కల ప్రకారం తప్పిపోయిన పిల్లలు, మహిళలను గుర్తించడంలో దేశంలోనే తెలంగాణ ముందజలో ఉంది. మహిళలు మిస్సయిన సమాచారం వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి వెంటనే వాళ్ళని పట్టుకోగలుగుతున్నాం. అలా తప్పిపోయిన వాళ్లలో 87 శాతం మందిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
అందుకు మహిళా భద్రతా విభాగంలో ప్రత్యేక పర్యవేక్షణ విభాగం నే ఏర్పాటు చేశారు. దానికోసం ఒక ప్రత్యేకమైన డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్ ని కేటాయించారు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వచ్చిన ఆ నెంబర్ కి సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తారు. భారత దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దాదాపు 25 శాతం ఈ అంశంలో ముందున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఈ శాతం ఇతర రాష్ట్రాల్లో 62శాతం మాత్రమే ఉంది. అయితే మహిళలు మిస్ అవ్వటానికి బలమైన కారణాలు అనేవి ఉండకపోవడం ఆలోచించాల్సిన విషయం. కనిపించకుండా పోయిన పిల్లలు, మహిళలు చాలా మంది చిన్న చిన్న కారణాలతో ఇంట్లోనుంచి వెల్తున్నారు. 99.9శాతం మంది చిన్న కారణాలతో ఇంట్లో నుంచి వెల్తున్నారు అని నమోదైన కంప్లైంట్ లను బట్టి తెలుస్తోంది.
టీనేజ్ అమ్మాయిలు మిస్ అవ్వటానికి ప్రధాన కారణం ప్రేమ విఫలమైందనో, కుటుంబ గొడవలు, ఆర్థిక సమస్యలు. కారణాలు ఏమైనా ఫిర్యాదు అందగానే కనిపించకుండా పోయిన వాళ్లను గుర్తిస్తున్నాము అని శిఖా గోయల్ అంటున్నారు. అయితే ఇదివరకు అమ్మాయిలను మాయ మాటలతో లొంగపరచుకుని వారిని అక్రమంగా రవాణా చేసి ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో వ్యభిచార కూపాలకు అమ్ముతున్న సంఘటనలు దాదాపుగా లేవని అంటున్నారు. గతంలో మాదిరిగా అవయవాల దోపిడీ కోసం కిడ్నాప్ చేయటం లాంటి ఘటనలు కూడా లేవంటున్నారు.
ఇక చిన్న పిల్లల విషయానికొస్తే పిల్లల హక్కుల రక్షణకై కఠిన చట్టాలు ఉన్నాయని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ హక్కులకు భంగం కలిగితే పరిస్థితి లేదని అంటున్నారు. ఒకప్పుడు పెద్దపెద్ద నగరాల్లో సిగ్నల్ ల వద్ద చిన్న పిల్లల్ని అడుక్కునే వాళ్ళలా మార్చి దందా చేస్తున్న మాఫియా ఇప్పుడు దాదాపుగా లేదన్నది పోలీసుల మాట.
ఇక మానవ అక్రమ రవాణా నిరోధించడానికి బేసిక్ లెవల్ నుంచే గట్టి ప్రణాళికలు ఉన్నాయన్నారు. ప్రతి జిల్లాకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని సహాయక చర్యలకు చేపడుతున్నామని తెలిపారు.
ప్రతి ఏడాదిలో రెండుసార్లు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ పేరుతో చిన్నారుల రక్షనకు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మైనర్లను ఇక్కడికి తీసుకొచ్చి పాతబస్తీలోని గాజుల కర్మాగారాలు ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్లుగా చేయిస్తున్న అనేక ముఠాలను ఆపరేషన్ స్మైల్ పేరుతో పట్టుకొని పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయంలో మొత్తం తెలంగాణలోనే సైబరాబాద్ కమిషనరేట్ ముందంజలో ఉంది. దీనికోసం దర్పణం అనే ఒక ప్రత్యేకమైన అప్లికేషన్ తయారుచేసి తప్పిపోయిన పిల్లల వివరాలను తోపాటు వారి తల్లిదండ్రుల వివరాలను ఈజీగా తెలుసుకొని పిల్లల్ని వారి తల్లిదండ్రులకు అప్పజెప్పగలుగుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..