
ఆదివారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో నిర్వహించిన మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళా రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు వ్యవసాయ యాంత్రీకరణ అనే పథకాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు.
ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళా రైతులకు ఆధునిక యంత్రాలను సబ్సిడీ కింద అందించనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్నే ఈ నిర్ణయంతో భూమిని సాగు చేయడం మరింత సులభతరం అవ్వగమే కాకుండా ఉత్పాదకత కూడా పెరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
చాలా వరకు మహిళలు కేవలం పొలాల్లో కూలీలుగానే ఉంటున్నారని.. వారు కూడా యంత్రాలు నడిపే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా రైతులు ఆర్థికంగా ఎదుగుతారని ఆయన తెలిపారు.
అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులు మారుతున్న టెక్నాలజీతో పాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోని ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఒకేరకమైన పంటలు మాత్రమే వేయకుండా ప్రతి ఏడాది ఒక్కో పంటల వేస్తూ.. పంట మార్పిడి ద్వారా లాభసాటి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.