మంత్రి ఎర్రబెల్లితో ఉద్యోగ సంఘాల భేటీ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరిన నాయకులు

|

Feb 06, 2021 | 12:51 PM

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన క్యాంపు కార్యాలయం..

మంత్రి ఎర్రబెల్లితో ఉద్యోగ సంఘాల భేటీ.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరిన నాయకులు
Follow us on

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును ఆయన క్యాంపు కార్యాలయం హన్మకొండలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో ఉద్యోగ సంఘాల నాయకులు కలుసుకున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలలో ఎంతో కాలంగా పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యల సాధనతో పాటు, పలు సమస్యల పరిష్కారానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కెసిఆర్ గారి ఆదేశాలతో దాదాపు అన్ని శాఖలలో ప్రొమోషన్స్ వచ్చినందుకు ఉద్యోగ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు మెరుగైన PRC ఫిట్మెంట్ విషయంలో ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పించాలని మంత్రిని కోరారు. పెండింగ్‌లో ఉన్న వివిధ సమస్యలు పరిష్కారమయ్యేందకు చొరవ చూపాలను మంత్రికి విజ్ఞప్తి చేశారు.

సీఎం కేసిఆర్ దృష్టికి ఉద్యోగుల సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో TGO, TNGO ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్స్ ఎన్నమనేని జగన్ మోహన్ రావు, కోలా రాజేష్ కుమార్, TRESA జిల్లా అధ్యక్షులు G. రాజకుమార్, రాష్ట్ర సహాధ్యక్షుడు రియాజుద్దీన్ TGO, TNGO నాయకులు మాధవ రెడ్డి, సదానందం, మురళీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

 

Read more:

ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన పునూరు.. ఫైబర్‌గ్రిడ్‌ ద్వారా ట్రిపుల్‌ ప్లే సర్వీసులు అందిస్తామన్న గౌతంరెడ్డి