పీఆర్‌సీ నివేదికపై నిరాశ వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. ప్రభుత్వాన్ని మెప్పించి ప్రయోజనాలు సాధిస్తామంటున్న నేతలు

|

Jan 28, 2021 | 5:20 AM

PRC Report: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ నివేదికపై తెలంగాణ ఉద్యోగులందరు తీవ్ర నిరాశతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్

పీఆర్‌సీ నివేదికపై నిరాశ వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. ప్రభుత్వాన్ని మెప్పించి ప్రయోజనాలు సాధిస్తామంటున్న నేతలు
Follow us on

PRC Report: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీ నివేదికపై తెలంగాణ ఉద్యోగులందరు తీవ్ర నిరాశతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక మెరుగైన వేతనాలు అందుకుంటామని భావిస్తున్న ఉద్యోగులకు పీఆర్‌సీ నివేదిక పెద్ద షాక్ ఇచ్చిందని టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. పీఆర్‌సీ అంటే ‘పే రివైజ్‌’ కావాలి కానీ తాజా నివేదికలో ‘పే రిడక్షన్‌’ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో ఆర్థిన మాంద్యం నెలకొన్న సమయంలో ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరించామని, ప్రస్తుతం రాష్ట్రం ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛను‌దారులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తామని సీఎం కేసీఆర్ గతంలో మాట ఇచ్చారు. ఆ విధంగానే ఉద్యోగులకు ప్రయోజనం కలగాలన్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వంపై సంపూర్ణ నమ్మకం ఉందని ప్రభుత్వాన్ని మెప్పించి ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలను సాధిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ కీలక వ్యాఖ్యలు.. ఆదాయం పెరుగుతుంది కానీ..