Telangana Polls 2023: 3లక్షల సిబ్బందితో ఎన్నికల నిర్వహణ.. ఆ కేంద్రాలపై ఫుల్ నజర్.. తేడా వస్తే ఇక అంతే..

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది ఎలక్షన్ కమిషన్. పోలింగ్‌కు ముందు జరిగే హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లను పూర్తి చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు EVMల పంపిణీ పూర్తి చేసింది.

Telangana Polls 2023: 3లక్షల సిబ్బందితో ఎన్నికల నిర్వహణ.. ఆ కేంద్రాలపై ఫుల్ నజర్.. తేడా వస్తే ఇక అంతే..
Telangana Ceo Vvikasraj

Updated on: Nov 28, 2023 | 6:26 AM

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజులే మిగిలి ఉండడంతో అన్ని ఏర్పాట్లు చకచకా పూర్తి చేస్తోంది ఎలక్షన్ కమిషన్. పోలింగ్‌కు ముందు జరిగే హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్లను పూర్తి చేసింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్‌ కేంద్రాలకు EVMల పంపిణీ పూర్తి చేసింది. ఇక పోలింగ్ నాడు.. దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్స్ అందుబాటులో ఉంచింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. అన్ని చోట్ల పకడ్బంధీగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే పార్టీలకు సూచనలు కూడా చేసింది.

119 అసెంబ్లీ నియోజకవర్గాలు.. 12 వేల సమస్యాత్మక కేంద్రాలు

రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. ఇక 49 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ సమయంలో ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో అబ్జర్వర్‌ను నియమిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇక ప్రతి నియోజకవర్గానికి మూడేసి చొప్పున SSTలు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తోంది ఈసీ. ఇక 12వేల క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించిన కమిషన్.. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను పంపాలని ఆదేశించింది. కేంద్ర,రాష్ట్ర బలగాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన సిబ్బందిని భద్రత కోసం వినియోగించనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాలని సైలెంట్ పీరియడ్‌లో ఎలాంటి ప్రచారం చేయకూడదని ఈసీ తెలిపింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేసింది.

వెయ్యికి పైగా కేసులు నమోదు..

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిబంధనలు అతిక్రమిస్తున్న నాయకుల పైన నిఘా పెట్టింది ఎన్నికల కమిషన్. ఎక్కడికక్కడ నమోదు అవుతున్న కేసుల పైన చర్యలు తీసుకుంటూనే ఫిర్యాదు ఆధారంగా నోటీసులు కానీ అడ్వైజరీ నోటీసులు కానీ ఎఫ్ఆర్‌లు కానీ నమోదు చేస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోడ్ ఉల్లంఘించిన వారిపైన దాదాపుగా వెయ్యికి పైగానే MCC వయొలేషన్‌ కేసులు నమోదు చేసింది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి స్పెషల్ అబ్జర్వర్లను నియమించింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. గతంలో జరిగిన సంఘటనలు జరగకుండా ECI ఫోకస్ పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..