Kishan Reddy: ఏడాది తర్వాత బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్.. రెండో లిస్ట్‌పై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల సమరంలో భాగంగా బీజేపీ తొలిజాబితా విడుదల చేసింది. సామాజిక వర్గాల వారీగా, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి అధిక స్థానాలను మొదటి జాబితాలో ప్రకటించారు. ఒకటిరెండు చోట్ల మినహా రెబల్స్ గొడవ లేకుండా తెలంగాణ కమల దళపతి జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి హైకమాండ్ కూడా ఆమోద ముద్రవేసింది.

Kishan Reddy: ఏడాది తర్వాత బీజేపీ కార్యాలయానికి రాజాసింగ్.. రెండో లిస్ట్‌పై కిషన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy-Raja Singh

Updated on: Oct 22, 2023 | 9:30 PM

Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల సమరంలో భాగంగా బీజేపీ తొలిజాబితా విడుదల చేసింది. సామాజిక వర్గాల వారీగా, అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఉత్తర తెలంగాణకు సంబంధించి అధిక స్థానాలను మొదటి జాబితాలో ప్రకటించారు. ఒకటిరెండు చోట్ల మినహా రెబల్స్ గొడవ లేకుండా తెలంగాణ కమల దళపతి జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి హైకమాండ్ కూడా ఆమోద ముద్రవేసింది. అనేక తర్జనభర్జనల తర్వాత 52 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే, రెండో జాబితాపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత శాసనసభ్యులు, ఎంపీలు, మున్సిపల్ చైర్మన్లు తదితరులకు మొదటి జాబితాలో చోటు దక్కిందని, దసరా తర్వాత రెండో జాబితాను ప్రకటిస్తామని జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాజాసింగ్, ధర్మపురి అర్వింద్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న రాష్ట్రంలో జరిగే బహిరంగ సభకు హోంశాఖ మంత్రి అమిత్‌షా రానున్నారని తెలిపారు. ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే పలు బహిరంగ సభల్లో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తోపాటు.. పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా పాల్గొంటారని తెలిపారు. దసరా పండుగ తర్వాత బీజేపీ ఎన్నికల కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని కిషన్ వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ప్రాథమికంగా కలిసి, మాట్లాడటం జరిగిందన్నారు. పొత్తు అంశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు.

ఏడాది తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రాజాసింగ్..

సుమారు ఏడాది తర్వాత హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్‌. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజాసింగ్‌పై.. గత ఏడాది ఆగస్టులో సస్పెన్షన్‌ వేటు వేసింది బీజేపీ అధిష్టానం. ఇప్పుడు ఆ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. దీంతో అనుచరులతో కలిసి రాజాసింగ్‌ భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు పలువురు నేతలు పార్టీ కార్యాలయంలో రాజాసింగ్‌కు స్వాగతం పలికారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..