
ఎప్పుడూ ఏదో చర్చ… ఎప్పుడో ఏదో రచ్చ.. ఏదీ లేకపోతే అది రాజకీయం ఎందుకవుతుంది. ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇన్నాళ్లూ ఏదో ఒక అంశమై అగ్గి రాజుకుంటున్న ఇక్కడి రాజకీయం… ఇప్పుడు జిల్లాల విషయమై నిప్పులు గక్కుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఎందుకీ రచ్చ జరుగుతోంది. తెలంగాణ, అంతర్గత భౌగోళిక స్వరూపం మారబోతోందా? తెలంగాణ రాష్ట్రం మరోసారి… జిల్లాల పరంగా అంతర్గత భౌగోళిక స్వరూపాన్ని మార్చుకోబోతోందా? అంటే నిజమేనన్న ముచ్చట వినిపిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న సంకేతాలు… మీడియా, సోషల్‌మీడియాల్లో జరుగుతున్న ప్రచారాలు.. దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే 33జిల్లాలుగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచుకోబోతోందా? లేక తగ్గించుకుంటుందా? అనే చర్చ జనాల్లో జోరందుకుంది. అంతేకాదు, ఎవరు ఏ జిల్లాలో కలుస్తారు? ఎవరు ఏ జిల్లా నుంచి విడిపోతారు? అనే సందిగ్ధత ఏర్పడిందిప్పుడు. అంతకన్నా ముందు, ఈవిషయమై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం.. మరింత మంటలు పుట్టిస్తోంది. జిల్లాల పునర్విభజనపై ఆచితూచి ప్రభుత్వ పెద్దల స్పందన ప్రచారం ఎలా ఉన్నా… నేతల మధ్య మాటల తూటాలు ఎలా ఉన్నా, జిల్లాల పునర్విభజన అంశంపై ఆచితూచి స్పందిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. గతంలో జరిగిన జిల్లాల పునర్విభజన సవ్యంగా జరగలేదని విమర్శిస్తూనే… మరోసారి మార్పులు తప్పవనే సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా ప్రత్యర్థులు చేస్తున్న తప్పుడు ప్రచారమన్న ముఖ్యమంత్రి.. ఇదే విషయమై క్లారిటీ ఇచ్చారు. జిల్లాల పునర్విభజనపై తమ ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు...