KVP Ramachandra rao: కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో భారీ చోరీ.. డైమండ్ నక్లెస్ మాయం..

|

May 31, 2022 | 11:31 AM

KVP Ramachandra rao: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. పటిష్ట భద్రత ఉన్న ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు.

KVP Ramachandra rao: కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో భారీ చోరీ.. డైమండ్ నక్లెస్ మాయం..
Kvp
Follow us on

KVP Ramachandra rao: కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు ఇంట్లో భారీ చోరీ జరిగింది. పటిష్ట భద్రత ఉన్న ఆయన ఇంట్లో చోరీకి పాల్పడ్డారు దుండగులు. రూ. 46 లక్షల విలువైన 49 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను మాయం చేశారు దుండగులు. ఈ చోరీపై కేవీపీ భార్య సునీత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11వ తేదీన ఓ ఫంక్షన్‌ ఉండగా.. తెలుపు రంగు డైమండ్ నెక్లెస్ ధరించి వెళ్లారు సునీత. ఫంక్షన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన అనంతరం బెడ్‌ రూమ్‌లో నెక్లెస్ పెట్టారు సునీత. అయితే, తాజాగా బెడ్‌ రూమ్‌లో పెట్టిన నెక్లెస్ కనిపించలేదు. నెక్లెస్ మాయమవడంతో ఇళ్లంతా వెతికారు సునీత. అయినా డైమండ్ నెక్లెస్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో పని మనుషులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు సునీత. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.