Telangana Corona Updates: ఒక్కరోజు 2000 కరోనా కేసుల నమోదు..తెలంగాణాలో కోవిడ్ విజృంభణ..అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే!

|

Apr 08, 2021 | 11:06 AM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజూవారీ నమోదవుతున్న కేసులు క్రమేపీ పైకెగస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది.

Telangana Corona Updates: ఒక్కరోజు 2000 కరోనా కేసుల నమోదు..తెలంగాణాలో కోవిడ్ విజృంభణ..అత్యధికం జీహెచ్ఎంసీ పరిధిలోనే!
Telangana Corona Updates
Follow us on

Telangana Corona Updates: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజూవారీ నమోదవుతున్న కేసులు క్రమేపీ పైకెగస్తుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈరోజు (గురువారం) ఉదయం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్ ప్రకారం రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 2055 కేసులు నమోదు అయ్యాయి.

  • బుధవారం నమోదైన కేసుల్లో అత్యధికంగా 398 మంది జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు అయ్యాయి.
  • తరువాత స్థానంలో 214 కేసులు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నమోదు అయ్యాయి.
  • 174 కేసులు రంగారెడ్డి జిల్లాలో నమోదు అయినట్టు అధికారులు తెలిపారు.
  • ములుగు జిల్లాలో అత్యల్పంగా 3 కేసులు మాత్రమే నమోదు కావడం గమనార్హం

ఇక తెలంగాణ లో కరోనాతో నిన్న ఏడుగురు మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్యా 1,741కి చేరింది. కరోనా బారినుంచి బుధవారం 303 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,03,601 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ఇక తెలంగాణా వ్యాప్తంగా మొత్తం 13,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. వీరిలో 8,263 మంది హొమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

Also Read: Coronavirus: దేశంలో కరోనా విలయతాండవం.. గత 24 గంటల్లో లక్షా 26 వేలు దాటిన కేసుల సంఖ్య

Narendra Modi: నేడు ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. కోవిడ్‌ పరిస్థితులపై కీలక నిర్ణయాలు..!