Telangana Budget: తెలంగాణను కాటేసిన కరోనా మహమ్మారి.. రూ. 50 వేల కోట్ల ఆదాయం కల్లాస్..!

|

Mar 07, 2021 | 4:58 PM

CM Kcr Review Meeting: త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రతిపాదిత..

Telangana Budget: తెలంగాణను కాటేసిన కరోనా మహమ్మారి.. రూ. 50 వేల కోట్ల ఆదాయం కల్లాస్..!
Follow us on

CM Kcr Review Meeting: త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్జెట్ ప్రతిపాదిత అంచనాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి కారణంగా తెలంగాణ రాష్ట్రం రూ. 50వేల కోట్ల ఆదాయం కోల్పోయినట్లు తేల్చారు. పద్దుల్లో పొందుపరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలు, ఆర్ధిక నివేదికలను ఆయన పరిశీలించారు. కరోనా అనంతర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని పేర్కొన్నారు. గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారం ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ది పథకాలకు నిధుల కేటాయింపుతో పాటు.. కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా గొర్రెల పెంపకం కార్యక్రమంపై ప్రభుత్వం స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఆ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణికి బడ్జెట్‌లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు.

కాగా, గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం మెచ్చుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సందర్భంగా అధికారుల వద్ద ప్రస్తావించారు. ఇదే సమయంలోపై చేపల పెంపకంపైనా దృష్టిసారించాలని అధికారులను సీఎం సూచించారు. ఈ పథకం కూడా మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. కాగా, బడ్జెట్ అంచనాలు, కేటాయింపుల కోసం విధి విధానాలను ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తన కార్యాచరణణు మొదలు పెట్టనున్నారు. ఆర్ అండ్ బీ, పంచాయితీ రాజ్, పురపాలక, విద్య, సాగునీటి శాఖల ప్రధాన అధికారులను వరుసగా పిలిచి.. ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమావేశాలు నిర్వహించనున్నారు. అన్ని శాఖలతో కసరత్తు పూర్తయ్యాక.. ఫైనల్‌గా సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బడ్జెట్‌కు తుది మెరుగులు దిద్దుతారు.

Also read:

మహిళా ఉద్యోగులకు ఒక్క రోజు సెలవు .. మహిళాదినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Apple For Kids Website : పిల్లల కోసం ‘యాపిల్’ ప్రత్యేక వెబ్ సైట్.. మానిటరింగ్ మాత్రం పేరేంట్స్‌కే..