Ration Card: మీకు ఇది తెలుసా?.. ఇకపై అంతా అక్కడే.. బయోమెట్రిక్‌పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పౌరసరఫరాలశాఖ..

|

Feb 04, 2021 | 3:51 AM

Ration Card: రేషన్ సరుకుల పంపిణీ విషయంలో బయోమెట్రిక్ విధానంపై ప్రజల్లో కన్‌ఫ్యూజన్‌ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల..

Ration Card: మీకు ఇది తెలుసా?.. ఇకపై అంతా అక్కడే.. బయోమెట్రిక్‌పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ పౌరసరఫరాలశాఖ..
Follow us on

Ration Card: రేషన్ సరుకుల పంపిణీ విషయంలో బయోమెట్రిక్ విధానంపై ప్రజల్లో కన్‌ఫ్యూజన్‌ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పందించింది. ఆ మేరకు క్లారిటీ ఇచ్చింది. ఆధార్‌తో మొబైల్ నెంబర్ అనుసంధానం, ఐరీష్ విధానం కోసం ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఆధార్‌కు ఫోన్ నెంబర్ అనుసంధానం, ఐరిష్ విధానం రేషన్ షాపుల్లోనే చేయించుకోవచ్చునని తెలిపింది. ఆ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ లబ్ధిదారులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని, ఇకపై ఆధార్‌కు ఫోన్ నెంబర్ అనుసంధానం, ఐరిస్ విధానం రేషన్‌ షాపుల్లోనే చేస్తారని ఉత్తర్వుల్లో తెలంగాణ పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఇందుకోసం రేషన్ డీలర్‌కు రూ. 50 చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఆధార్ కార్డ్‌కు ఫోన్ నెంబర్ అనుసంధానం చేయడానికి కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి నెంబర్ అయినా పర్వాలేదని పేర్కొంది.

ఇదిలాఉంటే, రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని తొలగించిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఐరిష్‌ లేదా ఆధార్‌ కార్డుతో అనుసంధానమైన మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పడం ద్వారా సరుకులు ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే మొదట్లో ఆధార్‌ తీసుకున్న చాలా మంది తమ మొబైల్‌ ఫోన్‌ నెంబర్లను ఆధార్‌తో అనుసంధానించుకోలేదు. దీంతో ఓటీపీ విధానం కచ్చితం చేయడంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ సమస్యకు చెక్‌ పెట్డడానికే పౌర సరఫరాల శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది.

ఆధార్‌తో మొబైల్‌ ఫోన్‌ అనుసంధానం కోసం తపాలాకార్యాలయాలను (పోస్ట్‌ ఆఫీసులను) వినియోగించుకోవాలని తెలిపింది. పోస్టల్‌ హైదరాబాద్‌ రీజియన్‌ పరిధిలో అందుబాటులో ఉన్న 124 ఆధార్‌ కేంద్రాల్లో.. మొబైల్‌ నెంబర్‌ లింక్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వీటితో పాటు 15 మొబైల్‌ కేంద్రాలు కూడా ఈ సేవల్ని అందిస్తాయని పేర్కొన్నారు. అయితే జనాలు గందరగోళానికి గురై మీసేవా కేంద్రాలు, బ్యాంకుల వద్ద, పోస్ ఆఫీస్‌ల వద్ద బారులు తీరుతున్నారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు తాజాగా స్పష్టమైన ప్రకటనను విడుదల చేసింది.
Also read:

రాజ్యాంగ విధి, ధర్మాన్ని అనుసరిస్తున్నాను : ఎస్వీ యూనివర్సిటీలో మీడియాతో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

Dharani Portal ‘ధరణి’ సైట్‌లో అందుబాటులోకి కొత్త ఆప్షన్.. ఇకపై ఆ వివరాలను నమోదు చేయాల్సిందే..