CM KCR: రోజాను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

Nagari MLA RK Roja: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా

CM KCR: రోజాను పరామర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

Updated on: Apr 24, 2021 | 7:58 AM

Nagari MLA RK Roja: ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫోన్ చేసి రోజా ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. కాగా.. నెలరోజుల క్రితం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆర్కే రోజా శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచనల మేరకు ఆమె చెన్నై నగరంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ ఆమెకు ఫోన్‌ చేసి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా రోజా కుటుంబ సభ్యుల యోగక్షేమాలను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. కాగా.. కేసీఆర్‌ స్వయంగా ఫోన్‌ చేయడంపై రోజా సంతోషం వ్యక్తంచేశారు.

కాగా.. సీఎం కేసీఆర్ ఇటీవల కరోనావైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఫాం హౌస్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం పరీక్షల కోసం హైదరాబాద్ వచ్చారు. ఇదిలాఉంటే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్‌కు, ఎంపీ సంతోష్ కుమార్‌కు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది.

 

Also Read:

Justice NV Ramana: ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ ప్రమాణం.. 48వ సీజేఐగా బాధ్యతల స్వీకరణ

Fuel price Today: స్థిరంగానే కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఏపీలోనే కనిపిస్తున్న పెరుగుదల

 

Loading...
Unable to load recommendations.
Follow Us