
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ధరణి దర్యాప్తునకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దర్యాప్తు కోసం ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ ఆడిట్.. ధరణి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేపట్టేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అలాగే విద్యాశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సంగారెడ్డిలో భూముల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు ప్రాజెక్టు పెరిగిన అంచనాలకు కూడా ఆమోదం తెలిపింది. బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పులకు అంగీకారం తెలిపింది. పంచాయతీల ఆర్థిక వెసులుబాటుకు ఆమోదం తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి