Telangana Budget 2026 Live: రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు, విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్షిప్

Telanagana Budget 2026 live updates in Telugu:తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి . సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 శాతం పెరిగి 3 లక్షల 35 వేల కోట్లకు చేరుకుంది.

Telangana Budget 2026 Live: రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు, విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్షిప్
Telangana Budget 2026

Updated on: Mar 20, 2026 | 1:38 PM

LIVE NEWS & UPDATES

  • 20 Mar 2026 01:38 PM (IST)

    ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌ న్యూస్

    ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందకు నిర్ణయం

    బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి

    త్వరలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం ప్రారంభిస్తున్నట్టు ప్రకటన

    రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా 421 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు చికిత్స పొందవచ్చన్న డిప్యూటీ సీఎం

    ఇందులో భాగంగానే ప్రతి ఉద్యోగికి డిజిటల్ కార్డు

  • 20 Mar 2026 01:32 PM (IST)

    గుడ్‌న్యూస్.. ఈ ఏడాది నుంచి స్కూళ్లలో కొత్తగా బ్రేక్ ఫాస్ట్ పథకం

    రాష్ట్రంలోని స్కూల్, కాలేజ్‌ చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.  ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ అందించే పథకాన్ని ప్రారంభించబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.

  • 20 Mar 2026 01:28 PM (IST)

    రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్‌ హాస్పిటల్స్‌పై ప్రారంభంపై కీలక ప్రకటన

    ఈ ఏడాది చివరి నాటికి కొన్ని హాస్పిటల్స్‌ను ప్రారంభించనున్నట్టు తెలిసిన డిప్యూటీ సీఎం

    2026 చివరి నాటికి సనత్ నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ ‘టిమ్స్’లను ప్రారంభించనున్నట్టు ప్రకటన

  • 20 Mar 2026 01:19 PM (IST)

    రాష్ట్ర ప్రజలకు మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా రూ.5లక్షల జీవిత బీమా

    మరో సరికొత్త పథకాన్ని ప్రకటించిన తెలంగాణ సర్కార్

    ఇందిరమ్మ కుటుంబ జీవన బీమాను ప్రకటించిన ప్రభుత్వం

    ఈ పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు లబ్ధి

    ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల జీవిత భీమా అందించనున్నట్టు ప్రకటన

  • 20 Mar 2026 12:39 PM (IST)

    రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు

    కొత్తగా 2లక్షల చేయూత పెన్షన్‌ల ప్రకటన

    బడ్జెట్ సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం ప్రకటన

     

     

  • 20 Mar 2026 12:37 PM (IST)

    విద్యార్థులకు గుడ్‌న్యూస్.. నెలకు రూ.2వేల స్కాలర్‌షిప్

    తెలంగాణలోని విద్యార్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

    ఇకపై రాష్ట్రంలో ఇంటర్ చదివే విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం పెట్టనున్నట్టు ప్రకటించింది

    విద్యార్థులకు సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్న డిప్యూటీ సీఎం

    అలాగే ఐఐటీ, ఏటీసీఎల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2వేల స్కాలర్‌షిప్ అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

     

  • 20 Mar 2026 12:31 PM (IST)

    రైతు భరోసా – రూ.18 వేల కోట్లు కేటాయింపు

    చేయూత – రూ.14,861 కోట్లు

    ఇందిరమ్మ ఇళ్లు – రూ.5,500 కోట్లు

    మహాలక్ష్మి పథకం – రూ.4,305 కోట్లు

    వడ్ల బోనస్ – రూ.3,500 కోట్లు

    గృహజ్యోతి – రూ.2,080 కోట్లు

    ఆరోగ్య శ్రీ – రూ.1143 కోట్లు

    LPG సబ్సిడీ – రూ.723 కోట్లు

    ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు

    విద్యుత్‌ సబ్సిడీ – రూ.14 వేల కోట్లు

    బియ్యం సబ్సిడీ – రూ.3 వేల కోట్లు

    కల్యాణలక్ష్మి, షాదీముబారక్ – రూ.3,683 కోట్లు

    విద్యార్థుల మెస్ ఛార్జీలు – రూ.2,170 కోట్లు

    స్కాలర్‌షిఫ్‌లు – రూ.4,343 కోట్లు

    ఎస్‌డీఎఫ్‌ – రూ.3,300 కోట్లు

    ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు

    పంచాయతీరాజ్‌ శాఖ – రూ.2,622 కోట్లు

    వ్యవసాయ శాఖ – రూ.23,179 కోట్లు

    పశుసంవర్ధక శాఖ – రూ.1,529 కోట్లు

    విద్యుత్ శాఖ – రూ.21,285 కోట్లు

    విద్యా శాఖ – రూ.26,674 కోట్లు

    వైద్య ఆరోగ్య శాఖ – రూ.13,6379 కోట్లు

    కార్మిక శాఖ – రూ.998 కోట్లు

  • 20 Mar 2026 12:26 PM (IST)

    తెలంగాణ 2026-27 బడ్జెట్‌లో కీలక అంశాలు

    పశు సంవర్థక శాఖకు రూ. 1,529కోట్లు కేటాయింపు

    విద్యుత్ శాఖకు రూ. 21,285 కోట్లు కేటాయింపు

    రాష్ట్రంలోని 118 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు ప్రతినెల 2 వేల స్కాలర్ షిప్ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం

    వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 13,679 కోట్ల కేటాయింపు

    కార్మిక శాఖకు రూ. 998కోట్లు కేటాయింపు

    మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ. 3,143 కోట్లు కేటాయింపు

    ఎస్సీ సంక్షేమానికి రూ. 11,784కోట్లు కేటాయింపు

    ఎస్టీ సంక్షేమానికి రూ. 7,937 కోట్లు కేటాయింపు

    బీసీ సంక్షేమానికి 3,769 కోట్లు కేటాయింపు

    రాజీవ్ యువ వికాసానికి 6 వేల కోట్లు కేటాయింపు

    గృహా నిర్మాణ శాఖకు 7,430కోట్లు కేటాయింపు

  • 20 Mar 2026 12:14 PM (IST)

    రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

    రూ.3లక్షల 24 వేల 234 కోట్లతో తెలంగాణ బడ్జెట్

    రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 34 వేల 406 కోట్లు

    మూలధన వ్యయం రూ. 47వేల 267 కోట్లు

  • 20 Mar 2026 12:02 PM (IST)

    అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి

    ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ

    సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • 20 Mar 2026 11:51 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో పాము కలకలం

    మీడియా పాయింట్‌ సమీపంలో కనిపించిన పాము

    అసెంబ్లీకి వచ్చే మార్గంలో కనిపించిన పాము

    వెంటనే అప్రమత్తమైన ట్రాఫిక్‌ పోలీసులు

    పామును చాకచక్యంగా పట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ వెంకటేశ్‌

    వెంకటేష్‌ నాయక్‌ను అభినందించిన అధికారులు

  • 20 Mar 2026 11:47 AM (IST)

    తెలంగాణ 2026-27 బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ భేటీ

    తెలంగాణ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన కేబినెట్

    రూ.3.35 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అవకాశం

    గతంలో పోల్చుకుంటే ఈ సారి పెరిగిన బడ్జెట్‌

  • 20 Mar 2026 11:45 AM (IST)

    కాసేపట్లో తెలంగాణ బడ్జెట్‌

    బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి బయలుదేరే ముందు ప్రజాభవన్‌లో ఉన్న నల్లపోచమ్మ ఆలయంలో భట్టివిక్రమార్క ప్రత్యేక పూజలు

    బడ్జెట్ ప్రతులను అమ్మవారి ముందుంచి పూజలు నిర్వహించిన డిప్యూటీ సీఎం

    రాష్ట్ర ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం రావాలి -భట్టి

    సంక్షేమ పథకాలు మరింత విస్తృతంగా ప్రజలకు చేరాలి – భట్టి

    ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలి: భట్టి

  • 20 Mar 2026 11:41 AM (IST)

    తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం

    మూడున్నర లక్షల కోట్లు ఉంటుందని అంచనా

    కాసేపట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న భట్టి

  • 20 Mar 2026 10:45 AM (IST)

    కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ

    కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో తెలంగాణ కేబినెట్‌ భేటీ కాబోతుంది

    మంత్రవర్గం బడ్జెట్‌కి ఆమోదం తెలపనుంది

    అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెడుతారు

    బడ్జెట్ ప్రస్తుతం ఉన్న దాని కంటే 10 శాతం పెరిగి 3 లక్షల 35 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది

    ప్రజాసంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది

    రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, సబ్సిడీ బియ్యం పథకాలకు నిధులు కేటాయించబోతున్నారు

    కల్యాణలక్ష్మి కింద ఇచ్చే మొత్తాన్ని లక్షా 30 వేలకు పెంచే అవకాశం ఉంది

ఈ సారి బడ్జెట్‌లో ప్రజాసంక్షేమం, విద్య, వ్యవసాయ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, సబ్సిడీ బియ్యం పథకాలకు నిధులు కేటాయించబోతున్నారు. రైతు భరోసా, రైతు బీమా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకాలకు భారీ కేటాయింపులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి నిధులు, పాఠశాలల్లో ముఖ్యమంత్రి బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రతిపాదించే అవకాశం ఉంది .
దీని వల్ల 21 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

అలాగే గిరిజనుల కోసం కొత్త చట్టానికి సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించబోతున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖలో వృద్ధ అర్చకులకు పెన్షన్‌ ఇచ్చే ప్రతిపాదన ఉండబోతుందున్నట్లు తెలుస్తోంది. పారా అథ్లెట్లకు ఇళ్ల స్థలాలు, ప్రోత్సాహకాల కోసం నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే కల్యాణ లక్ష్మి కింద అదనంగా 30 వేల రూపాయలు ఇచే అంశాన్ని ప్రతిపాదించబోతున్నారు. అప్పుడు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి కింద అందించే మొత్తం లక్షా 30 వేలు అవుతుంది. ఈ సారి బడ్జెట్‌లో ఉద్యోగుల EHS హెల్త్ స్కీమ్ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించబోతున్నట్టు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us