Telangana: ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా!

తెలంగాణ వార్షిక బడ్జెట్‌ 2026-27 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే ఇందిరమ్ ఇళ్ల పేరుతలో ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వం తాజాగా ఇందిరమ్మ కుంటుంబ జీవితా పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5లక్షల మేర జీవిత బీమాను అందిస్తున్నట్టు ప్రకటించింది.

Telangana: ప్రభుత్వం నుంచి మరో గుడ్‌న్యూస్.. ఉచితంగా కుటుంబానికి రూ.5లక్షల జీవిత బీమా!
Indiramma Family Life Insurance

Edited By:

Updated on: Mar 20, 2026 | 1:21 PM

ఒక కుటుంబం నిలబడేది ఒక్క ఆధారంపై.. ఆ ఆధారం ఒక్కసారిగా కూలిపోతే ఆ ఇంటి గోడలే కాదు, వారి జీవితాలే కుదేలవుతాయి. ఆదాయం తెచ్చే వ్యక్తి అకస్మాత్తుగా లేకపోతే.. బాధ ఒక వైపు, భవిష్యత్తుపై భయం మరో వైపు కుటుంబాన్ని వెంటాడుతాయి. అలాంటి పరిస్థితుల్లో ఎవరూ రోడ్డున పడకూడదన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. “ఇందిరమ్మ కుటుంబ జీవన భీమా” పేరుతో వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1 కోటి 15 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా రక్షణ కల్పించనున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల వరకు జీవిత భీమా సదుపాయం అందించబడుతుంది.2026 జూన్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానుందని ప్రభుత్వం వెల్లడించింది. కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తి లేకపోయినా… ఆ ఇంటి భవిష్యత్తు చీకటిలో కలిసిపోకుండా కాపాడటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us