Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, ఆరు గ్యారంటీల పథకాలకు విస్తృత కేటాయింపులు చేశారు. మూసీ ప్రాజెక్టుకు కూడా నిధులు కేటాయించారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, అంబేద్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

Telangana Budget 2025: అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చాం: డిప్యూటీ సీఎం భట్టి
Bhatti Vikramarka

Updated on: Mar 19, 2025 | 11:27 AM

తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు(బుధవారం) రాష్ట్ర బడ్జెట్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు. తమని నమ్మి అధికారం కట్టబెట్టిన ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యం అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్‌ స్ఫూర్తితోనే ప్రజా పాలన కొనసాగిస్తామన్నారు. దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారం. కొంతమంది అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలను తిప్పికొడుతూ.. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని భట్టి వెల్లడించారు. అయితే ఈ బడ్జెట్‌లో ఆధునిక వ్యవసాయ విధానాలను ప్రొత్సహించేలా కేటాయింపులు, మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి భారీగా కేటాయింపులు ఉన్నాయి. అలాగే మూసీ ప్రాజెక్ట్‌ కోసం కూడా నిధులు కేటాయించారు. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉండనున్నాయి.

విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూనే.. వ్యవసాయం, ఆరు గ్యారంటీలు, ట్రిపులార్, ఫ్యూచర్‌ సిటీ, మెట్రో విస్తరణతో పాటు మూసీ పునరుజ్జీవానికి అవసరమైన నిధులు ఈ బడ్జెట్‌లో కేటాయించనున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మిగిలిపోయిన పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది ప్రభుత్వం. అందులోభాగంగానే… బడ్జెట్ ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే బడ్జెట్‌ ప్రసంగానికి ముందు ప్రజాభవన్‌లోని నల్లపోచమ్మ ఆలయానికి వెళ్లారు డిప్యూటీ సీఎం భట్టి దంపతులు. 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రతులకు పూజలు చేశారు. ఆ పూజల అనంతరం ప్రజాభవన్‌ నుంచి అసెంబ్లీకి వచ్చారు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న భట్టి విక్రమార్క ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.