Telangana BJP: ఆ 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. మరోసారి బాంబ్ పేల్చిన బండి సంజయ్ కుమార్..

|

Jan 01, 2021 | 2:02 PM

Telangana BJP: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు..

Telangana BJP: ఆ 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. మరోసారి బాంబ్ పేల్చిన బండి సంజయ్ కుమార్..
Follow us on

Telangana BJP: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చారు. తాము ఓకే అంటే వారు వెంటనే పార్టీలో చేరతారని చెప్పుకొచ్చారు. అయితే రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాలి కాబట్టి వారిన పక్కన పెట్టామని సంజయ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కార్పొరేటర్లు సైతం బీజేపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. శుక్రవారం నాడు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ని ఎంపీ బండి సంజయ్ కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అయితే బీజేపీ నుంచి ఎవరూ వెళ్లరని, టీఆర్ఎస్‌కు చెందిన కార్పొరేటర్లే బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంఐఎం లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా రాకపోతుండేనని అన్నారు. కాగా, 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో త్వరలో బీజేపీలో చేరతానంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా బండి సంజయ్ స్పందించారు. బీజేపీ సిద్ధాంతాలతో కలిసి పని చేయగలిగిన వ్యక్తి రాజగోపాల్ అని అన్నారు. త్వరలోనే రాజగోపాల్ రెడ్డిని కలుస్తానని సంజయ్ చెప్పారు.

 

Also read:

ఫైజర్-బయోఎంటెక్ వ్యాక్సిన్ వినియోగంపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి.. పేద దేశాలకు టీకా అందించేందుకు ఏర్పాట్లు

అతి తక్కువ సినిమాలు రిలీజ్ అయిన సంవత్సరంగా ‘2020’.. దశాబ్దంలోనే మొదటిసారి.. ఎన్ని చిత్రాలంటే ?..