Telangana Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 5వ రోజు ఎజెండా.. చర్చాంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవీ..

|

Oct 05, 2021 | 8:11 AM

తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల చర్చనూ చేపట్టనున్నారు. ఇక ఇవాళ ఐదవరోజు..

Telangana Assembly: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో 5వ రోజు ఎజెండా.. చర్చాంశాలు, ప్రవేశపెట్టే బిల్లులు ఇవీ..
Telangana Assembly
Follow us on

Telangana Assembly Monsoon Sessions: తెలంగాణ శాసన సభ, మండలి ఉభయ సభల్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల చర్చనూ చేపట్టనున్నారు. ఇక ఇవాళ ఐదవరోజు ఉభయ సభల సమావేశాల్లో చర్చకు వచ్చే అంశాలు ఇలా ఉన్నాయి. ద‌ళితులు ఆర్థికంగా ఎద‌గాల‌నే ఉద్దేశంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత బంధు ప‌థ‌కంపై శాస‌న‌స‌భ‌లో స్వ‌ల్ప‌కాలిక చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంత‌రం ద‌ళిత బంధు ప‌థ‌కంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ వివ‌ర‌ణ ఇవ్వ‌నున్నారు.

ఈ చర్చకు ముందు.. మైనార్టీల సంక్షేమం, పాత‌బ‌స్తీలో అభివృద్ధిపై శాస‌న మండ‌లిలో స్వ‌ల్పకాలిక చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. జీఎస్టీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లు, టౌటింగ్ చ‌ట్టం బిల్లుపై కూడా మండ‌లిలో చ‌ర్చించ‌నున్నారు. ఈ రెండు బిల్లుల‌కు నిన్న శాస‌న‌స‌భ ఆమోదం ముద్ర పడిన సంగతి తెలిసిందే.

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా త‌ల‌స‌రి విద్యుత్ వినియోగం, వైకుంఠ‌ధామాలు, డంపింగ్ యార్డులు, ఆరోగ్య ల‌క్ష్మి అమ‌లు, చెక్‌డ్యాంల నిర్మాణం, ఆరోగ్య వివ‌రాల రికార్డులు, ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల నిర్వ‌హ‌ణ‌పై కూడా చర్చిస్తారు.

శాసనమండలిలో చర్చకు వచ్చే ప్రశ్నలు.. ఇవీ:

తెలంగాణ శాసనమండ‌లిలో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా మెగా డెయిరీ ప్రాజెక్టుల ఏర్పాటు, క‌ళాకారుల‌కు పింఛ‌ను చెల్లింపు, జీహెచ్ఎంసీ ప‌రిధిలో ఎస్ఎన్‌డీపీ అభివృద్ధి కార్య‌క్ర‌మం, పారిశ్రామిక రంగంపై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్యాట‌క అభివృద్ధి, రీజిన‌ల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించనున్నారు.

సమావేశాలను పొడిగింపు..

ఇక.. శాసనసభ వర్షాకాల సమావేశాలను పొడిగించనున్నారు. ఈ నెల అయిదో తేదీ వరకే జరపాలని గత నెల 24న జరిగిన సభాకార్యకలాపాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ తర్వాత భారీ వర్షాల వల్ల సభకు మూడు రోజుల పాటు విరామం కల్పించారు. దీంతో తాజాగా పొడిగింపు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో సభను ఎన్నిరోజులు కొనసాగించాలనే దానిపై ఇవాళ (మంగళవారం) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. బీఏసీ సమావేశం లేదా సభాపక్ష నేతలతో చర్చించి, సభాపతి తమ నిర్ణయాన్ని ప్రకటించే చాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి:  PPF Account: మీ పీపీఎఫ్ ఖాతా మెచ్యూరిటీ ముగిసన తర్వాత మీరు ఇలా చేయండి.. లేకుంటే..

Thailand Flood: వర్షాలు.. వరదలతో వణికిపోతున్న థాయ్‌లాండ్.. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటూ జనం..