KCR : ఇవాళ వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్.. కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం.!

CM KCR Government Hospital visits : తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు.. మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా..

KCR : ఇవాళ వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్న సీఎం కేసీఆర్..  కరోనా రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం.!
KCR in MGM

Updated on: May 21, 2021 | 10:38 AM

CM KCR Government Hospital visits : తెలంగాణలో కరోనా బారిన పడిన రోగుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నంతోపాటు.. మరింత మెరుగైన వైద్యం అందడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించి రోగులకు కొండత ధైర్యాన్నిచ్చిన ముఖ్యమంత్రి కేసిఆర్.. ఇవాళ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిని సందర్శించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ చికిత్స పొందుతున్న విధానం, సౌకర్యాలు తదితర వివరాలు సీఎం కేసీఆర్ నేరుగా బాధితులను కలుసుకొని వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం అందేలా చూడాలని డాక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేశారు కేసీఆర్. మరో వైపు వారు చేస్తున్న సేవను అభినందించారు. అదే క్రమంలో నేడు వరంగల్ ఎంజిఎంలో కూడా సందర్శించి, మెరుగైన సౌకర్యాలు, బాధితుల్లో ధైర్యం నింపనున్నారు. గాంధీ ఆసుపత్రి సందర్శనలో ముఖ్యమంత్రి కేసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కేవలం మాస్కులు మాత్రమే ధరించి సందర్శించి, కరోనా గురించి మరీ భయం అవసరం లేదన్నది చెప్పకనే చెప్పారు. ఇక, ఇవాళ్టి ఎంజిఎం ఆస్పత్రి సందర్శనకు సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి హరీశ్ కూడా విచ్చేయబోతున్నారు.

Read also : Jogi Ramesh : వెన్నుపోటుదారుల సంఘానికి అధ్యక్షుడు చంద్రబాబు అయితే, ఉపాధ్యక్షుడు.. రఘురామ కృష్ణరాజు : అసెంబ్లీలో జోగి రమేష్

Follow Us