Collector Wife: గవర్నమెంట్‌ ఆస్పత్రిలో కలెక్టర్‌ అనుదీప్ భార్యకి డెలివరీ… కలెక్టర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం..

|

Nov 10, 2021 | 3:48 PM

Collector Wife: ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను ప్రజల కోసం ఏర్పాటు చేసే సంస్థలను ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకోకుండా డబ్బులు ఉన్నాయని ప్రయివేట్ బాటపడితే..

Collector Wife: గవర్నమెంట్‌ ఆస్పత్రిలో కలెక్టర్‌ అనుదీప్ భార్యకి డెలివరీ... కలెక్టర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం..
Collector Wife
Follow us on

Collector Wife: ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను ప్రజల కోసం ఏర్పాటు చేసే సంస్థలను ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించుకోకుండా డబ్బులు ఉన్నాయని ప్రయివేట్ బాటపడితే ఇక సామాన్య ప్రజలు ఎలా వాటిని నమ్ముతారు. ఒక ప్రభుత్వం ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న పాఠశాలైన, ప్రభుత్వ ఆస్పత్రులనైనా ఎలా వినియోగలించుకుంటారు అని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. అయితే కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉన్నత పదివిలో ఉన్నా తాము చేసే పనులతో పదుగురికి ఆదర్శంగా నిలవాలని.. కోరుకుంటారు. అలాంటి ఎందరో కలెక్టర్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేసే ఉద్యోగాలు తమ పిల్లలను ప్రభుత్వం పాఠశాలలో చదివిస్తున్నవారు ఉన్నారు. ఇక తమ ఇంట్లో ఎవరైనా మెడికల్ సదుపాయం కావాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకుని వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ జిల్లా కలెక్టర్ తన భార్యను సామాన్యుడిలా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ భార్య పండండి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాచలం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన సేవలతో.. ఇప్పటికే ప్రజల మనసుని దోచుకున్నారు. ఇప్పుడు ఓ సామాన్యుడి జీవితానికి మరింత దగ్గర చేస్తూ అనుదీప్ ప్రవర్తన పదిమందికి ఆదర్శంగా నిలిచింది.. తాజాగా ఇతను తన భార్యకు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించి, ఇటు ప్రభుత్వ ఆస్పత్రులపైన, ప్రభుత్వ అధికారులపైన ప్రపజలకు నమ్మకం కలిగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ గర్భిణి అయిన అతని భార్య మాధవిని ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు.

జిల్లా కలెక్టర్..ఆయన తలచుకుంటే పెద్ద పెద్ద కార్పోరేట్ ఆసుపత్రిల్లో చేర్పించవచ్చు..కానీ ఒక సామాన్యుడిలా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించారు.. ఆయన భార్య మాధవిని మొదటి కాన్పు కోసం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించగా నవంబరు 09 అర్ధరాత్రి 1.16 ని.లకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఒక జిల్లా కలెక్టర్‌ ఇలా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు.

 

Also Read:  నా పాట చూడు నాటు నాటు అంటూ.. కిరాక్ స్టెప్ప్‌తో అదరగొట్టిన తారక్, చెర్రీలు..