Telangana Corona Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు వైరస్ వ్యాప్తి విస్తృతంగా పెరుగుతోంది. కరోనా రక్కసి విజృంభణతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 3840 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం నాడు కరోనా బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 1198 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో కరోనా రక్కసి కారణంగా 9 మంది బలి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,494 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో 20,215 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రలో మరణాల రేటు 0.52 శాతంగా ఉండగా.. రికవరీ రేటు మాత్రం 90.55 శాతంగా ఉంది. అయితే రికవరీ రేటు భారీ స్థాయిలో తగ్గుతుండటంతో ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కరోనా బారిన పడి ఆస్పత్రల్లో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో బెడ్లు లభించడం లేదు. ఆస్పత్రులన్నీంటిల్లోనూ హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,41,885 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,09,594 మంది కోలుకుని క్షేమంగా ఉన్నారు. ఇదే సమయంలో కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 1797 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 505 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరిలో – 407, రంగారెడ్డి జిల్లా – 302, నిజామాబాద్ జిల్లా – 303, సంగారెడ్డి జిల్లా – 175, జగిత్యాల జిల్లా – 167, కామారెడ్డి జిల్లా -144, కరీంనగర్ జిల్లా -124, ఖమ్మం జిల్లా – 111, మహబూబ్‌నగర్ జిల్లా – 124, మంచిర్యాల జిల్లా – 101, నల్లగొండ జిల్లా – 116, నిర్మల్ జిల్లా – 159, వరంగల్ అర్బన్ జిల్లా – 114 చొప్పున అత్యధికంగా ఈ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
Also read:
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కరోనా కలకలం..! పలువురు సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ..