Former Naxalite: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో మాజీ నక్సలైట్ పామేన భీమ్ భరత్ లొంగిపోయాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉన్న భీమ్ భరత్.. సోమవారం నాడు తనకు తానుగా కోర్టులో లొంగిపోయాడు. షాబాద్ మండలంలోని నరడల్‌గూడ గ్రామానికి చెందిన పామేన్ భీమ్ భరత్.. గతంలో ఓ హత్య కేసులో ఏ1 ముద్దాయిగా ఉన్నాడు. అయితే ఈ కేసు నేపథ్యంలో భీమ్ భరత్ దాదాపు రెండు సంవత్సరాలుగా అజ్ఞాతవాసంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. తాజాగా భీమ్ భరతే స్వయంగా వచ్చి చేవెళ్ల కోర్టులో లొంగిపోయారు. ఈ విషయాన్ని షాబాద్ సీఐ తెలిపారు. కోర్టు భరత్‌కు 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించిన సీఐ.. అతన్ని చర్లపల్లి జైలుకు తరలించామన్నారు.
Also read:
టాలీవుడ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకెళుతోన్న చిత్ర నిర్మాణాలు.. అద్దె పరికరాలు కూడా దొరకని పరిస్థితి.
దిల్ రాజు నిర్మాణంలో నందమూరి హీరో… లక్కీ ప్రొడ్యుసర్ అయినా హిట్ ఇస్తాడో చూడాలి.