Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టీస్‌గా ఉజ్జల్ భూయాన్..

|

May 17, 2022 | 2:12 PM

ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం చేసిన సిఫారసులతో.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను..

Telangana High Court: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ.. కొత్త చీఫ్ జస్టీస్‌గా ఉజ్జల్ భూయాన్..
Telangana High Courts Chief
Follow us on

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భూయాన్ ను సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యామూర్తిగా బదిలీ చేయాలని కొలీజియం చేసిన సిఫారసులతో.. జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిఫార్సు చేశారు. జస్టిస్ భుయాన్ 2011 17 అక్టోబర్ గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 20వ తేదీన నిర్దారించబడ్డారు. మిజోరాం స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అస్సాం జ్యుడీషియల్ అకాడమీ, గౌహతిలోని నేషనల్ లా యూనివర్శిటీలతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నారు.

తర్వాత ఆయన బాంబే హైకోర్టుకు బదిలీ చేయబడ్డారు. 2019 అక్టోబర్ 3వ తేదీన బాంబే హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. ముంబైలో రెండేళ్లపాటు పనిచేసిన తర్వాత.. ఆయన తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా ఉన్నారు.