యూజర్స్ పాలిట సంజీవనిగా మారిన సోషల్ మీడియా అల్గారిథమ్.. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న సరికొత్త టెక్నాలజీ

ఎవరికైనా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చి.. సోషల్ మీడియాలో.. చాలు.. ఇక బతకలేను.. అని ఒక లైన్ టైప్ చేసినా.. ఇదే నా లాస్ట్ డే అని ఒక క్యాప్షన్ పెట్టినా.. ఎవరూ నన్ను గుర్తుపెట్టుకోకండి అని వీడియో పెట్టినా.. అది వెంటనే తెలంగాణ పోలీసుల దృష్టికి వెళ్తోంది. వెంటనే వారు యాక్షన్‌లోకి దిగి ప్రాణాలు కాపాడుతున్నారు. ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటున్నారా? అదే సోషల్ మీడియా అల్గారిథమ్ + TGCSB రియల్ టైమ్ రెస్పాన్స్. ఈ సరికొత్త టెక్నాలజీతో ప్రజల ప్రాణాలకు భద్రత కల్పిస్తున్నారు పోలీసులు.

యూజర్స్ పాలిట సంజీవనిగా మారిన సోషల్ మీడియా అల్గారిథమ్.. ప్రజల ప్రాణాలు కాపాడుతున్న సరికొత్త టెక్నాలజీ
Tg News

Edited By: Anand T

Updated on: Nov 28, 2025 | 6:18 PM

లవ్ బ్రేకప్ అయిందనీ.. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని.. చాలా మంది చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఆత్మహత్యకు ముందు వీడియోలు, నోట్‌లు, రీల్స్ రూపంలో తమ బాధను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే వీరందరూ ఆత్మహత్యలు చేసుకునే ముందు ఇలా సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌లు వాళ్ల ప్రాణాలకు సంజీవనిగా మారుతున్నాయి. అలా పోస్ట్ చేసిన నిమిషాల్లోనే సోషల్ మీడియా అల్గారిథమ్ ఆపద సంకేతాలను TGCSBకి పంపుతోంది. దీంతో వెంటనే పోలీసులు యాక్షన్లోకి దిగి వాళ్ల ప్రాణాలను రక్షిస్తున్నారు.

ఇందుకు వనపర్తి జిల్లాలో జరిగిన గటనే నిదర్శనంగా నిలుస్తుంది. వనపర్తి పాలిటెక్నిక్‌ విద్యార్థి.. 30 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో ఇంట్లో తండ్రితో గొడవ అయింది. తరువాత Insta ఓపెన్ చేసి ‘ఇదే నా లాస్ట్ డే ‘ అని వీడియో రికార్డ్ చేశాడు. అయితే ఆ వీడియో పబ్లిష్ అయిన కొన్ని నిమిషాలకే ఇన్‌స్టా అల్గారిథమ్ దాన్ని ‘సెల్ఫ్-హార్మ్ కంటెంట్’గా ట్యాగ్ చేసింది. TGCSBకి వెంటనే అలర్ట్ వెళ్లింది. వారు లొకేషన్ ట్రేస్ చేసి స్థానిక పోలీసులకు పంపారు. పోలీసులు వెళ్లేసరికే ఆ కుర్రాడు తలుపులు వేసుకుని ఉన్నాడు. సమయానికి అక్కడికి చేరుకున్న పోలీసులు అతడ్ని కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చి సేఫ్ ప్లేస్‌కి షిఫ్ట్ చేశారు.

ఇలానే నిజామాబాద్‌కు చెందిన వ్యక్తినికి కూడా కాపాడారు. కుటుంబ సమస్యలతో లైవ్‌లో ‘ఇక చాలు ఈ జీవితం’ అని చెప్పడంతో. మెటా సిస్టమ్స్ వెంటనే అలర్ట్ అయింది. TGCSBకి మెసేజ్ పంపింది. అక్కడి నుంచి సమాచారం స్థానిక పోలీసులకు సమాచారం వెళ్లడంతో మరో ప్రాణం నిలబడింది. ఇలా నాలుగు వారాల్లో 12 మందిని కాపాడారు పోలీసులు. అలాంటి కంటెంట్ పోస్ట్ చేసిన.. 10 నిమిషాల లోపే మాకు అలర్ట్ వస్తుందని.. ఆలస్యం చేయకుండా స్థానిక పోలీసులను రంగంలోకి దించి.. ప్రాణాలు నిలుపుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ మాత్రమే కాదు.. సైబరాబాద్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, వనపర్తి, జగిత్యాల, మహబూబ్‌నగర్, సిద్దిపేట, అన్ని ప్రాంతాల్లో ఇలా చాలామంది ప్రాణాలు నిలిపారు పోలీసులు. ఇది సాధారణ ఫ్లాగింగ్ కాదు. అల్గారిథమ్ కొన్ని ప్రత్యేక సిగ్నల్స్‌ను చూస్తుంది బ్లేడ్ కట్స్, మాత్రల బాటిల్, కెమికల్స్, ‘I’m done’, ‘End of story’, ‘Last day’, డార్క్ థీమ్డ్ వీడియోలు, డిస్ట్రెస్ బేస్డ్ క్యాప్షన్లు, క్రైసిస్ లైవ్ స్ట్రీమ్స్.. ఈ కీవర్డ్లు లేదా ఇమేజెస్ కనిపిస్తే.. వెంటనే TGCSBకి రియల్ టైమ్ వార్నింగ్ వస్తుంది.

TGCSB, మెటా (Instagram/Facebook), కొన్ని పెద్ద సోషల్ ప్లాట్‌ఫార్మ్స్ మధ్య అవగాహనా ఒప్పందాలు ఉండటంతో చాలామంది ప్రాణాలు నిలబడుతున్నాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు, వారి కుటుంబాలకు సైకాలజికల్ కౌన్సెలింగ్ అందించేందుకు TGCSB కొన్ని NGOs‌తో కూడా టై-అప్ చేయబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.