Weather Updates: సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ

ఏపీ, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది.

Weather Updates: సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారింది.. బీకేర్‌ఫుల్ అంటున్న వాతావరణ శాఖ
Weather Report

Updated on: May 08, 2025 | 4:21 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సమ్మర్‌ సీజన్‌ కాస్తా.. రెయినీ సీజన్‌గా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు తెలుగు ప్రజలను భయపెడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, మరోవైపు ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టిస్తోంది. రానున్న మూడు రోజులు తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణాలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గురువారం(మే 08) తెలంగాణలోని 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. రేపు తెలంగాణలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌కు కూడా వర్ష సూచన చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. ఇవాళ రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రేపు ఉష్ణోగ్రతలు 40°C – 42°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..