South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!

షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్‌ – నాగర్‌ సోల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3 నుంచి 25 వరకు అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. ఈ ట్రైన్‌లో థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, ఫస్ట్‌ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నట్టు వివరించింది.

South Central Railway: షిర్డీ వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్‌.. ఆ రోజు నుంచి అందుబాటులోకి ప్రత్యేక రైళ్లు!
Specai Trains

Updated on: Jun 24, 2025 | 6:40 PM

షిర్డీ సాయిబాబా దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే షిర్డీకి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్రకటించింది.
సికింద్రాబాద్‌ – నాగర్‌ సోల్‌ మధ్య ఈ ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు జులై 3 నుంచి 25 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

సికింద్రాబాద్‌ నుంచి నాగర్‌ సోల్‌ రైలు వెళ్లే (07001) రైలు జులై 3 నుంచి ప్రతి గురువారం రాత్రి 9.20 గంటలకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 9.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని రైల్వేశాఖ పేర్కొంది. మరోవైపు నాగర్‌ సోల్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే (07002) రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు నాగర్‌సోల్‌ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 7.30 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపింది.

ఈ రైలు రెండుమార్గాల్లో ప్రయాణించే ట్రైన్‌ మల్కాజ్‌గిరి, బొల్లారం, మేడ్చెల్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర, ముద్ఖేడ్, నాందెడ్‌, పూర్ణ, పర్బని, జాల్నా, ఔరంగాబాద్‌ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రల్వే శాఖ తెలిపింది. ఈ రైలులో థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, ఫస్ట్‌ ఏసీ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..