Singareni Election: సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్ 27న గుర్తింపు ఎన్నికలు

|

Dec 04, 2023 | 9:19 PM

తెలంగాణలో మరో ఎన్నికల సైరన్‌ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది.

Singareni Election: సింగరేణిలో మోగిన ఎన్నికల నగారా.. డిసెంబర్ 27న గుర్తింపు ఎన్నికలు
Singareni Elections
Follow us on

తెలంగాణలో మరో ఎన్నికల సైరన్‌ మోగింది. సింగరేణిలో ఈనెల 27న కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండు రోజులు కాకముందే సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు సంబంధించి గతంలోనే ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసి నామినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. అయితే అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దాంతో సింగరేణి ఎన్నికలను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌ సింగరేణి ఎన్నికల అధికారి శ్రీనివాసులు సమక్షంలో జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డితోపాటు జాతీయ సంఘాల నాయకులు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, ఐఎఫ్‌టీయూ, ఇతర సంఘాల నాయకులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏకాభిప్రాయానికి రావడంతో ఈనెల 27న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. దాంతో సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల ఓటరు లిస్టును ఎన్నికల అధికారి కార్మిక సంఘాల నాయకులకు అందజేశారు.

అయితే 2017 సెప్టెంబర్‌‌ 5న జరిగిన సింగరేణి ఎన్నికల్లో బీఆర్‌‌ఎస్‌‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మొత్తం 11 ఏరియాల్లో తొమ్మిది ఏరియాలు గెలుచుకుని గుర్తింపు సంఘమైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధి కార్మిక క్షేత్రాల్లోని 12 నియోజకవర్గాలతోపాటు ఇతర ప్రభావిత నియోజకవర్గాల్లో సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…