రంజాన్ పండుగ నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బుధవారం తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసి, ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఈ విందును ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఇఫ్తార్‌విందును షియా ముస్లింలు బాయ్‌కాట్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తరఫున ఇచ్చే ఇఫ్తార్ విందు తేదీని మార్చాలని హోంమంత్రి, ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఇఫ్తార్ విందుకు హాజరుకావొద్దని షియావర్గం పెద్దలు ప్రకటించారు. మహమ్మద్ ప్రవక్త కుటుంబసభ్యుల్లో ఒకరైన హజరత్ అలీ..వీరమరణం పొందడంతో షియావర్గం ముస్లింలు సంతాప దినాలుగా భావిస్తారు. ఆ తేదీల్లో ఎలాంటి విందు వినోదాల్లో పాల్గొనడం వారికి నిషేధం.
ఆ దినాల్లోనే ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంపై షియా ముస్లింలు భగ్గుమంటున్నారు. అటు సున్నీవర్గం ముస్లింలు ఇఫ్తార్‌విందు తేదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం వర్గాలకు చేసిన వాగ్ధానాలు పూరత్ఇ చేయకుండానే కేవలం ఇఫ్తార్ విందు ఇస్తూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని సున్నీవర్గం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ ఇచ్చే ఇఫ్తార్ విందులో 30శాతం మంది కూడా ముస్లింలు ఉండరని షియా ప్రతినిధి చెబుతున్నారు. ఇఫ్తార్‌పార్టీ తేదీ మార్చాలని హోంమంత్రి, ప్రభుత్వ పెద్దలను కలిసినా స్పందించలేదన్నారు బీజేపీ మైనార్టీనేత ఫిరాసత్ బకారి. మొత్తానికి ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌విందుపై రగడ కొనసాగుతోంది. సో..ముస్లిం పెద్దలవినతిపై ప్రభుత్వం స్పందిస్తుందా..? లేక అనుకున్న ప్రకారమే ముందుకెళ్తుందా..? వేచి చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం