Telangana BJP: తెలంగాణ శాసనసభ పక్షనేత ఎంపికలో జాప్యం అందుకేనా.. బీజేపీ పెద్దలు ఏమంటున్నారు..

ఎన్నికలు ముగిసిన చాల రోజులు అవుతున్నా బీజేపీలో మాత్రం శాసన సభకి తమ నాయకుడు ఫైనల్ కాలేదు. ఎట్టకేలకు రాష్ట్ర అధ్యక్షుడు ఎదో ఒకటి చేద్దామన్నా లెక్క కుదరక పోవడంతో బీజేపీ ఎల్పీ నాయకుడి ఎన్నిక నడ్డా కోర్టులో పడింది. తెలంగాణలో మళ్లీ పోల్‌ దంగల్‌కు సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి.

Telangana BJP: తెలంగాణ శాసనసభ పక్షనేత ఎంపికలో జాప్యం అందుకేనా.. బీజేపీ పెద్దలు ఏమంటున్నారు..
Telangana Bjp

Edited By: Srikar T

Updated on: Jan 09, 2024 | 12:26 PM

ఎన్నికలు ముగిసిన చాల రోజులు అవుతున్నా బీజేపీలో మాత్రం శాసన సభకి తమ నాయకుడు ఫైనల్ కాలేదు. ఎట్టకేలకు రాష్ట్ర అధ్యక్షుడు ఎదో ఒకటి చేద్దామన్నా లెక్క కుదరక పోవడంతో బీజేపీ ఎల్పీ నాయకుడి ఎన్నిక నడ్డా కోర్టులో పడింది. తెలంగాణలో మళ్లీ పోల్‌ దంగల్‌కు సమయం దగ్గర పడుతోంది. అన్ని పార్టీలు పార్లమెంట్‌ ఎన్నికలపై ఫోకస్‌ పెట్టాయి. ఐతే కొత్త సర్కార్‌ కొలువుదీరి  మంత్‌ క్యాలెండర్‌ మారినా.. తెలంగాణ అసెంబ్లీ బీజేపీ పక్ష నేత ఎవరు? అనే ముచ్చట మాత్రం  ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. 8మంది ఎమ్మెల్యేలతో సభలో బీజేపీ కలర్‌ పెరిగింది. కానీ 8మందిలో ఒకర్ని లీడర్‌గా ఎన్నుకోవడంలో  మాత్రం జాప్యం కొనసాగుతూనే ఉంది. తీన్మార్‌ విక్టరీ కొట్టిన రాజాసింగ్‌కు- మహేశ్వర్‌ రెడ్డి మధ్య గట్టి పోటీనే ఆలస్యానికి కారణమా?

ఇప్పటికే  ఒక దఫా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఐనా బీజేపీ శాసనసభ పక్ష నేతను ఖరారు చేయడం ఓ కొలిక్కి రావడంలేదు. బడ్జెట్‌ సమావేశాల దగ్గర పడుతున్నాయి కాబట్టీ  బీజేపీ ఎల్పీ లీడర్‌ను ఎన్నుకోవడం అనివార్యం.ఈ క్రమంలో  బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, పార్టీ ఇన్‌చార్జ్‌ తరుణ్‌చుగ్‌.. 8మంది ఎమ్మెల్యేలు సహా పార్టీ సీనియర్ల అభిప్రాయాల సేకరణతో ప్రాథమిక ప్రక్రియ పూర్తి చేశారు. 8 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చూపారట. ఐతే  కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌ రెడ్డిలను ఓడించిన వెంకట రమణారెడ్డికి ఛాన్స్‌ ఇవ్వడం మంచిదని తరుణ్‌ చుగ్‌ సూచించారట. ఎమ్మెల్యేలు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.

 

ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..